Nuclear Weapons: రష్యా, చైనా ఎఫెక్ట్.. అణ్వాయుధాల పరీక్షకు ట్రంప్ పచ్చ జెండా..
ఇతర దేశాల కంటే అమెరికా ఎక్కవు అణ్వాయుధాలను కలిగి ఉందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. తమ దేశం వెంటనే అణ్వాయుధాలను పరీక్షించడం ప్రారంభిస్తుందని ప్రకటించారు.
ఇతర దేశాల కంటే అమెరికా ఎక్కవు అణ్వాయుధాలను కలిగి ఉందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. తమ దేశం వెంటనే అణ్వాయుధాలను పరీక్షించడం ప్రారంభిస్తుందని ప్రకటించారు.
భారత ప్రధాని మోదీ చాలా చక్కని వ్యక్తి. మంచి తండ్రి లక్షణాలున్నాయి. కానీ చాలా కఠినాత్ముడు, జెయింట్ కిల్లర్ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ కొరియాలోని గ్యాంగ్జులో జరుగుతున్న ఎపెక్ సీఈవో సదస్సులో ఆయన మాట్లాడారు.
అమెరికా వలసదారులకు భారీ షాకిచ్చింది ట్రంప్ గవర్నమెంట్. వర్క్ పర్మిట్ విధానంపై కొత్త రూల్ ను పాస్ చేసింది. ఇక మీదట EAD లను ఆటోమాటిక్ గా రెన్యువల్ చేయమని ప్రకటించింది. ఈ నిర్ణయం వేలాది విదేశీ ఉద్యోగులపై ముఖ్యంగా భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
జమైకా, క్యూబా, హైతీ, బహమాస్ లలో మెలిస్సా హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. దీని ధాటికి 32 మంది మృతి చెందారు. వరదలు కారణంగా మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి.
ఏపీతో ఆగిపోతుందనుకున్న మొంథా తుఫాను దిశ మార్చుకుని తెలంగాణపై ప్రతాపం చూపిస్తోంది. ఊహించని రీతిలో మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలు నీట మునిగాయి.
మొంథా తుఫాను ప్రభావం తెలంగాణపై కూడా పడింది. అక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రేపు తెలంగాణ అంతటా స్కూళ్ళు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొత్తానికి అనుకున్నది సాధించారు. భారత్ కు సరఫరా అవుతున్న రష్యా చమురుకు అంతరాయం కలిగించగలిగారు. రీసెంట్ గా రష్యా నుంచి వస్తున్న చమురు ట్యాంకర్ మార్గ మధ్యంలోనే యూటర్న్ తీసుకుందని తెలుస్తోంది.
మొంథా తుఫాను రెండు రోజుల పాటూ ఏపీపి వణికించేసింది. భారీ వర్షాలకు భారీగానే ఆస్తి నష్టం సంభవించింది. విపరీతమైన వానలు డిండి జలాశయం ఉప్పొంగి శ్రీశైలం జాతీయ రహదారి దెబ్బతింది.
కెనడాలోని ప్రముఖ పంజాబీ సింగర్ చన్నీ నట్టన్ ఇంటిపై కాల్పులు చోటు చేసుకున్నాయి. దీనికి తామే బాధ్యత వహిస్తున్నామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో ప్రకటించుకుంది. సర్దార్ ఖేడాతో చన్నీకు ఉన్న స్నేహం కారణంగానే కాల్పులని చెప్పింది.