Stock Market: మూడో రోజు మరింత నష్టాల్లోకి..సెన్సెక్స్ 600 పాయింట్లు పతనం

మూడో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. గత రెండు రోజుల కంటే కూడా ఈ రోజు మరింత నష్టాల్లోకి జారిపోయింది. సెన్సెక్స్  600 పాయింట్లకు దిగజారిపోయింది. 

New Update
stock market losses

రెండు రోజులు భారీ నష్టాల్లో జారుకున్న ఇండియన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఈ రోజు ఉదయం కాసేపు హమ్మయ్య అనిపించింది. ప్రారంభం తర్వాత కాసేపు సూచీలు లాభాల్లో కదలాడాయి. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. లాస్ట్ రెండు రోజుల్లాగానే ఈ రోజు కూడా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్ల ప్రకటన వేళ మదుపర్ల లాభాల స్వీకరణకు దిగారు. దీంతో సూచీలు వరుసగా మూడో నష్టాలు చవిచూశాయి. అమెరికా ఫెడ్ నిర్ణయాలు భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి వెలువడనున్నాయి. 

600 పాయింట్ల పతనం..

డిసెంబర్ 10న స్టాక్ మార్కెట్ మునుపటి రెండు రోజుల కంటే క్షీణించింది. సెన్సెక్స్ 275 పాయింట్లు పడిపోయి 84,391 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 82 పాయింట్లు పడిపోయి 25,758 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో  85,020.34 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. గరిష్ఠాల నుంచి దాదాపు 600 పాయింట్ల మేర పతనమైంది. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 19 పెరిగాయి, 11 పడిపోయాయి. ఇండిగో షేర్లు 3.17% పడిపోయాయి. బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్‌లో ఈరోజు భారీ అమ్మకాలు జరిగాయి.  ఎటర్నల్‌, ట్రెంట్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, ఐటీసీ, ఎన్టీపీసీ, రిలయన్స్‌ షేర్లు లాభపడ్డాయి. 

ప్రపంచ మార్కెట్ల పరిస్థితీ అంతే..

ప్రపంచ మార్కెట్లు కూడా డీలా పడిపోయాయి. నిన్న , ఇవాళ కూడా అవి క్షీణించాయి. ఆసియా మార్కెట్లలో.. జపాన్ నిక్కీ ఇండెక్స్ 0.10% తగ్గి 50,602 వద్ద, కొరియా కోస్పి 0.21% పెరిగి 4,135 వద్ద ముగిశాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.42% పెరిగి 25,540కి చేరుకోగా, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.23% తగ్గి 3,900కి చేరుకుంది. ఇక డిసెంబర్ 9న US డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.38% తగ్గి 47,560.29 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.13% పెరిగ్గా.. S&P 500 0.088% పడిపోయాయి.

Advertisment
తాజా కథనాలు