India VS South Africa: చెమటోడ్చిన టీమ్ ఇండియా..సౌత్ ఆఫ్రికా టార్గెట్ 177

దక్షిణాఫ్రికాతో టీ 20 సీరీస్ మొదలైంది. కటక్ లో జరుగుతున్న మొదటి మ్యాచ్ లో టాస్ ఓడిపోయిన భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. కష్టపడి 176 పరుగులు చేసి సఫారీలకు 177 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. 

New Update
hardhik

టీ20 సీరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో భారత బ్యాటింగ్ లైనప్ ఫెయిల్ అయింది. పెద్ద స్కోరు సాధించాల్సిన చోట 176 పరుగులతో సరిపెట్టింది. ఎప్పటిలానే ఈ మ్యాచ్ లో కూడా టీమ్ ఇండియా కెప్టెన్ టాస్ ఓడిపోయాడు. దీంతో భారత జట్టు బ్యాటింగ్ కు దిగింది. మొదట ఓవర్లోనే సౌత్ ఆఫ్రికా లుగి ఎంగిడి శుభ మన్ గిల్ వికెట్ తీసి షాకిచ్చాడు. తాను ఎదుర్కొన్న మొదట బంతికే ఫోర్ బాదిన గిల్..తరువాత బంతికే అవుట్ అయ్యాడు. తరువాత వచ్చిన బ్యాటర్లతో పాటూ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా ఎక్కువగా పరుగులు చేయలేకపోయారు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఒక్కడే కాస్త పరుగులు సాధించగలిగాడు. 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో పాండ్యా 59 పరుగులు కొట్టి హాప్ సెంచరీ కొట్టాడు. ఇతని తర్వాత తిలక్ వర్మ 26, అక్షర్ పటేల్ 33, అభిషేక్ శర్మ 17 పరుగులు చేశారు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3, లుథో సిపమ్లా 2, డొనావన్ ఫెరీరా ఒక వికెట్ పడగొట్టారు.  

Advertisment
తాజా కథనాలు