Morocco: మొరాకోలో కూలిన రెండు భవనాలు...19 మంది మృతి

మొరాకోలని ఫెజ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కడ రెండు భవనాలు కూలి...19 మంది ప్రాణాలు కోల్పోయారు. మొరాకోలో పట్టణ భద్రత, అభివృద్ధి సవాళ్లపై పెరుగుతున్న ఆందోళనల మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

New Update
moraco

మొరాకోలోని పురాతన మరియు అత్యంత జనసాంద్రత కలిగిన నగరాల్లో ఫెజ్ ఒకటి. కానీ ఇప్పుడు అదే అక్కడ ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఈరోజు ఫెజ్ నగరంలో రెండు భవనాలు కూలిన ఘటన తీవ్ర విషాదానికి దారి తీసింది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరో 16 మంది గాయపడ్డారు. అల్-ముస్తాక్బాల్ పరిసరాల్లో ఈ ప్రమాదం జరిగింది. వీటిల్లో ఎనిమిది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే ఈ బిల్డింగులను చాలా కాలం నుంచి ఎవరూ పట్టించుకోవడం లేదని..అందుకే కూలిపోయాయని అధికారులు తెలిపారు. 

మోరాకోలు వెల్లువెత్తుతున్న ఆందోళనలు..

ఫెజ్ స్థానిక అధికారుల ప్రకారం అర్థరాత్రి బిల్డింగులు కూలిపోయాయి. సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు, భద్రతా సిబ్బంది, పౌర రక్షణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నాయి. వాటి మధ్య చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు.  ఫెజ్ ఎనిమిదవ శతాబ్దం నాటి మాజీ సామ్రాజ్య రాజధాని. ఇక్కడ రెండు నెలల నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. దిగజారుతున్న జీవన పరిస్థితులు, నిరుద్యోగం, ప్రజా సేవల వైఫల్యంపై మొరాకోలో దేశ వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. యువత ఆందోళనలు చేపట్టారు. భద్రతా కార్యాలయాన్ని ముట్టడించడంతో పోలీసులు కాల్పులు చేశారు. ఇందులో ముగ్గురు మరణించారు.  400 మందికి పైగా అరెస్ట్ చేశారు. 

Advertisment
తాజా కథనాలు