Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి పురస్కారానికి మచాదో గైర్హాజరీ..వెనెజులా ప్రభుత్వం వల్లనే..

 నోబెల్ పురస్కారాలను అందించే కార్యక్రమం ఈ రోజు నార్వేలో జరుగుతోంది.  దీనికి ఈ ఏడాది శాంతి బహుమతి పొందిన మరియా కెరీనా మచాడో గైర్హాజరు అయ్యారు. బయటకు వస్తే నేరస్థురాలిగా ప్రకటిస్తామని వెనెజులా ప్రభుత్వం ప్రకటిస్తామని చెప్పడంతో ఆమె కార్యక్రమానికి రాలేదు. 

New Update
Maria Corina Machado

Maria Corina Machado

అనుకున్నట్టుగానే అయింది. నోబెల్ శాంతి బహుమతి అందుకోవడానికి మరియా మచాదో హాజరు కాలేదు. నార్వే రాజధాని ఓస్లో లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మరియా కుటుంబ సభ్యులు, పలు దేశాల ప్రముఖులు హాజరయ్యారు. మచాదో తరుఫున శాంతి పురస్కారాన్ని ఆమె కూతురు అందుకుంది.  ప్రస్తుతం జరుగుతున్న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి కూడా ఆమె హాజరు కావట్లేదని నోబెల్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్ క్రిస్టియన్ బెర్గ్ హార్ప్వికెన్ తెలిపారు. తరువాత జరగాల్సిన మీడియా సమావేశాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. 

నేరస్థురాలిగా ప్రకటిస్తామని బెదిరింపు..

ఈ ఏడాది నొబెల్ శాంతి బహుమతి చాలానే చర్చకు దారి తీసింది. ఎంత ప్రయత్నించినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అది దక్కలేదు. వెనిజులా విపక్ష నేత మరియా కొరీనా మచాదోకు దక్కింది. అయితే గత ఏడాదిగా ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. దాదాపు ఏడాదిగా ఆమె ఎవరికీ కనిపించకుండా దాక్కున్నారు. అక్కడి నుంచే వెనిజులాలోని నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నారు. దీంతో ఈమెపై వెనిజులా ప్రభుత్వం విపరీతమైన కోపంతో ఉంది. మచాదోపై క్రిమినల్ కేసులను కూడా నమోదు చేసింది. ముఖ్యంగా కుట్రలు, విద్వేషాన్ని ప్రేరేపించడం, ఉగ్రవాదం వంటి అభియోగాలు ఉన్నాయని.. అందుకే ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా పరిగణిస్తున్నట్లు వెనిజులా అటార్నీ జనరల్ తారెక్ విలియం సాబ్ స్పష్టం చేశారు. బహుమతిని స్వీకరించడానికి దేశం దాటి బయటకు వెళ్తే.. ఆమెను పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని అన్నారు. అరెస్ట్ కూడా చేస్తామని బెదిరించారు. ఈ కారణంగానే ఇప్పుడు మరియా మచాదో నోబెల్ అందుకోవడానికి కూడా బయటకు రాలేకపోయారని తెలుస్తోంది. 

నార్వేజియన్ నోబెల్ కమిటీ.. వెనిజులా ప్రజల కోసం మరియా కొరినా మచాదో చేసిన అవిశ్రాంత కృషి, వారి హక్కుల కోసం చేసిన పోరాటం వల్లే ఆమెకు నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసినట్లు తెలిపింది. దాదాపు గత ఏడాది కాలంగా.. ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఉన్నప్పటికీ, ఆమె వెనిజులాలోనే అజ్ఞాతంలో ఉండి నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని వివరిస్తూనేకమిటీ ఆమెను 'శాంతి ఛాంపియన్‌'గా అభివర్ణించింది. ముఖ్యంగా లాటిన్ అమెరికాలో ప్రజల ధైర్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా చెప్పింది.

Advertisment
తాజా కథనాలు