Akhanda-2: బాలయ్య ఫ్యాన్స్ కు బంపరాఫర్.. ఒకే రోజు రెండు శుభవార్తలు!

బాలకృష్ణ నటించిన 'అఖండ 2' సినిమా టిక్కెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రేపు, డిసెంబర్ 11 రాత్రి 9 గంటలకు జరిగే ప్రీమియర్ షోకు టిక్కెట్ ధర రూ.600గా నిర్ణయించారు.

New Update
akhanda

అఖండ 2 సినిమాపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతినిచ్చింది. జీఎస్టీతో కలిపి సింగిల్‌ స్క్రీన్‌లో రూ.50 , మల్టీ ప్లెక్స్‌లో రూ.100  ధర పెంచుకునేందుకు వీలు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. మూవీ విడుదలైన అంటే రేపటి నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు ఇవి అమలులో ఉంటాయి. 

రేపే ప్రీమియర్ షోలు..

 రేపు, డిసెంబర్ 11 రాత్రి 9 గంటలకు జరిగే ప్రీమియర్ షోకు టిక్కెట్ ధర రూ.600గా నిర్ణయించారు. అలాగే, డిసెంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ థియేటర్‌లలో రూ.50 చొప్పున టిక్కెట్ ధరలను పెంచడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

akhanda-tg

 అఖండ 2 సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉండగా..లావాదేవీలకు సంబంధించిన కోర్టు కేసు నడవడంతో వాయిదా పడింది. అయితే అది కాస్తా సాల్వ్ అవడంతో డిసెంబర్ 12న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు కూడా ప్రసారం చేయనున్నారు. డిసెంబర్ 11 రాత్రి 9 గంటల నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానుంది. అఖండ' (2021) బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisment
తాజా కథనాలు