Amazon: భారత్ కు క్యూ కడుతున్న కంపెనీలు.. అమెజాన్ భారీ పెట్టుబడులు..10 లక్షల ఉద్యోగాలు

భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు వరుసపెట్టి పెద్ద కంపెనీలన్నీ క్యూలు కడుతున్నాయి. నిన్న మైక్రోసాఫ్ట్ ఈరోజు అమెజాన్. ఈ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ 2030 నాటికి భారత్‌లో 35 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడతామని ప్రకటన చేసింది. 

New Update
14,000 layoffs in amazon

14,000 layoffs in amazon

అమెరికా కంపెనీలన్నీ భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇండియా నుంచి ఉద్యోగస్థులను తీసుకెళ్ళడం కాదు...అక్కడే వారికి ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నాయి. నిన్న మైక్రోసాఫ్ట్ ఏఐ మీద బారత్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ముందు వచ్చింది. ఇప్పుడు అమెజాన్ వంతు. భారత్ లో ఈ దిగ్గజ ఈ కామర్స్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అయింది. 2030 నాటికి ఇండియాలో వివిధ వ్యాపారాల్లో దాదాపు 35 బిలియన్ డాలర్లు అంటే రూ. 3.14 లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామని అమెజాన్ ప్రకటించింది. వ్యాపార విస్తరణతో పాటూ ఉపాధి కల్పన కోసం ప్రణాళికలు రచిస్తామని చెప్పింది. ఢిల్లీలో జరిగిన అమెజాన్ సంభవ్ సమ్మిట్‌లో దీనికి సంబంధించి ప్రకటనను చేసింది. వచ్చే 5ఏళ్ళల్లో 10 లక్షల ఉద్యోగాలను కల్పించడమే తమ లక్ష్యమని చెప్పింది. గడిచిన 15 సంవత్సరాల కాలంలో భారత్‌లో అమెజాన్ సంస్థ 40 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు తెలిపింది. 

ఏఐ, డిజటలైజేషన్ లక్ష్యంగా..

భారత్‌లోని విస్తృత డిజిటల్, ఆర్థిక ప్రాధాన్యతలకు అనుగుణంగా ఏఐ ఆధారిత డిజిటలైజేషన్, ఉద్యోగాల సృష్టి, ఎగుమతుల్లో వృద్ధి లక్ష్యంగా ఈ పెట్టుబడులను పెడతామని అమెజాన్ చెబుతోంది. ఈ సంస్థ ఇప్పటి వరకు భారత్ లో 12 లక్షల వ్యాపారాలను డిజిటలైజ్ చేసిందని..2024లో దాదాపు 2.8 మిలియన్ల మందికి ప్రత్యక్ష, పరోక్ష, సీజనల్ వారీగా ఉపాధి అవకాశాలు కల్పించినట్లు చెప్పింది. 2030 నాటికి మరిన్ని పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపింది. గడిచిన 15 సంవత్సరాల్లో భారత్ డిజిటల్ ప్రయాణంలో మేము భాగమైనందుకు సంతోషంగా ఉంది. మా కంపెనీ వృద్ధి అనేది భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగానే ఉందని అమెజాన్ నిర్వాహకులు చెప్పారు. భారత్‌లో చిన్న వ్యాపారాలకు డిజిటల్ మౌలిక సదుపాయాలను అందించడం, లక్షలాదిగా ఉద్యోగాలు సృష్టించడం, మేడ్ ఇన్ ఇండియాను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లే దిశగా భారీగా పెట్టుబడులు ఇప్పటికే పెట్టామని..భవిష్యత్తులో ఆ దిశగా మరిన్ని పెడతామని అమెజాన్ ఎమర్జింగ్ మార్కెట్స్ సీనియర్ ఉపాధ్యక్షుడు అమిత్ అగర్వాల్ తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు