Pakistan: మహిళా జర్నలిస్టుకు కన్నుకొట్టిన పాక్ ఆర్మీ అధికారి..తిట్టి పోస్తున్న జనం

పాకిస్తాన్ అధికారులు మాటలు పడడంలో ముందుంటారు. తాజాగా పాక్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తీవ్ర విమర్శల పాలౌవుతున్నారు. మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్ట్ కు కన్నకొట్టడంపై జనాలు తిట్టిపోస్తున్నారు. 

New Update
pak army (1)

Pakistan

Pakistan: పాకిస్తాన్ అధికారులు ఎప్పుడు ఎందుకు ఏమిటి చేస్తారో వారికే తెలియదు. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి చేసిన పని తీవ్ర విమర్శల పాలౌతోంది. అధికా మీడియా సమావేశంలో అనుచితంగా ప్రవర్తించడంతో సోషల్ మీడియాలో జనాలు ఏకిపారేస్తున్నారు. మహిళా జర్నలిస్ట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. పలువురు మీడియా సభ్యుల ముందే సదరు మహిళా జర్నలిస్ట్‌ను చూసి కన్ను గీటారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్మీ జనరల్ అహ్మద్ షరీఫ్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక మహిళా జర్నలిస్ట్ ఇమ్రాన్ ఖాన్ పై అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆయన కన్న గీటారు. 

Also Read: స్టూడెంట్స్ పార్టీల ఉచ్చులో పడొద్దు.. ఓయూలో రేవంత్ సంచలన స్పీచ్!

ఛీ ఛీ ఇంత కంటే దిగజారలేరు..

అసలు ఆ సందర్భంలో ఆర్మీ అధికారి షరీఫ్ కు కన్ను గీటాల్సిన అవసరం ఏం వచ్చిందో తెలియడం లేదంటూ సోషల్ మీడియాలో జనాలు తిడుతున్నారు. చెత్త పనులు, చెత్త బుద్ధులు అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. సదరు మహిళా జర్నలిస్ట్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మీద వస్తున్న ఆరోపణల గురించి.. అంటే ఆయన పాకిస్తాన్ దేశ భద్రతకు ముప్పు, దేశ వ్యతిరేకి, ఢిల్లీ చేతుల్లో ఉన్నారంటూ వస్తున్న ఆరోపణల గురించి అహ్మద్ షరీఫ్‌ను ప్రశ్నించారు. అలానే ఇది గతంలో జరిగిన దానికంటే ఎలా భిన్నంగా ఉంది.. లేదంటే భవిష్యత్తులో ఏదైనా మార్పును మనం ఆశించవచ్చా అని ప్రశ్నించారు.నిజానికి ఇది చాలా సీరియస్ ప్రశ్న. దేశాన్ని కుదిపేసిన ఇమ్రాన్ ఖాన్ విషయం. షరీఫ్ దీనిపై స్పందిస్తూ.. మీ ప్రశ్నలకు మరో పాయింట్‌ను కూడా చేర్చాలి. ఇమ్రాన్ ఖాన్ ఒక 'జెహ్ని మరీజ్' అంటే మానసిక రోగి కూడా అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన సదరు జర్నలిస్ట్ వైపు చూసి నవ్వి, కన్నుగీటారు.  దీనిపై నెటిజన్లు చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. ఒక ఆర్మీ అధికారే ఇలా చేశారంటే ఏం చెప్పాలి. పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం అంతమైంది. ప్రధాని ఒక తోలు బొమ్మ అంటూ విమర్శలు చేస్తున్నారు. 

Also Read: భారత్ కు క్యూ కడుతున్న కంపెనీలు.. అమెజాన్ భారీ పెట్టుబడులు..10 లక్షల ఉద్యోగాలు

ఇమ్రాన్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు..

ఇదంతా అయిపోయాక మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కూడా ఆర్మీ అధికారి షరీఫ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనొక నార్సిస్ట్ అని..ఇమ్రాన్ రాజకీయ ఆశయాలు ఎంత తీవ్రంగా మారాయంటే.. తాను అధికారంలో లేకపోతే, ఇంకేదీ ఉండకూడదు అని అనుకుంటున్నారని ఆరోపించారు. అలానే ఖైదులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను కలుస్తున్న వ్యక్తులు సైన్యంపై విషం చిమ్మడానికి ప్రయత్నిస్తున్నారని షరీఫ్ ఆరోపించారు. సైన్యంపై ప్రజల్లో శత్రుత్వాన్ని పెంచడానికి చూస్తున్నారని ఆరోపించారు.  పాకిస్తాన్ సైన్యం, అలానే.. తమ దేశ ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి తాము ఎవరినీ అనుమతించము అని చెప్పకొచ్చారు.

Advertisment
తాజా కథనాలు