/rtv/media/media_files/2025/12/10/fake-cement-2025-12-10-17-24-00.jpg)
AP Fake Cement: శ్రీ సత్య సాయి జిల్లాలో నకిలీ సిమెంట్ పరిశ్రమ భాగోతాన్ని బట్టబయలు చేశారు విజిలెన్స్ అధికారులు. ఎవరికీ అంతు చిక్కని రీతిలో సిమెంట్ లో బూడిద కలిసి జనాలను మోసం చేసిన కస్తూరి సిమెంట్స్ పై విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేశారు. విజిలెన్స్ శాఖ జిల్లా అధికారి ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం కస్తూరి సిమెంట్‌పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కస్తూరి సిమెంట్‌కు పీపీసీ (పోర్ట్‌ల్యాండ్ పొజోలానా సిమెంట్) విక్రయాలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంది. అయితే వీరు న్యాయంగా వ్యాపాం చేయకుండా అక్రమాలకు పాల్పడుతూ ఎన్నో ఇళ్ళు నేలపాలవ్వడానికి కారణమయ్యారు. సిమెంట్ లో మోతాదుకు మించి బూడిదను కలిపి విక్రయించారు. రెండూ ఒకే కలర్ , ఒకే టెక్స్చర్ ఉండడంతో ఎవరూ కనిపెట్టలేరని ఈ మోసానికి పాల్పడ్డారు. అదొక్కటే కాదు సిమెంట్ ను నకిలీ అల్ట్రాటెక్ కంపెనీ సంచుల్లో కూడి నింపి కర్ణాటకకు తరలించి విక్రయించారు.అల్ట్రాటెక్, మహా సిమెంట్స్, భారతి సిమెంట్స్ బ్రాండ్స్ పేరుతో ప్లయాష్‌ను కల్తీ చేసి నకిలీ సిమెంట్ బ్యాగ్‌లు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో తరలించడానికి లారీలో సిద్ధం చేసిన సిమెంట్ బస్తాలను తనిఖీ చేయగా అవి నకిలీగా తేలాయి.
లక్షల ఇళ్ళు సందిగ్ధంలో..
సిమెంట్ లో బూడిద సగాని కన్నా ఎక్కువే ఉన్నట్టు తనిఖీల్లో బయటపడింది. ఇళ్ళను గట్టిగా ఉంచేదే సిమెంట్. ఇప్పుడూ అదే కల్తీ అయితే అవి ఎలా నిలబడతాయి. ఇప్పటికే కస్తూరి సిమెంట్ తో చాలా నిర్మితమై ఉంటాయి. ఇప్పుడు వాటి పరిస్థితి ఏమవుతుందో తెలియదు. నీరు కలిపితే సిమెంట్ గట్టిపడుతుంది. అందుకే ఎంతటి వానలు, వరదలూ, చిన్న భూకంపాలు లాంటివి వచ్చినా గృహాలకు ఏమీ కాదు. కానీ బూడిదకు ఆ గుణం ఉండదు. అది నీటితో కరిగిపోతుంది. లేదా మెత్తబడిపోతుంది. ఇప్పుడు సిమెంట్ లో బూడిద కలవడం వలన ఇళ్ళకు ఆ స్ట్రాంగ్ నెస్ పోతుంది. కాలక్రమంలో ఇవి కూలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పటికే కస్తూరీ సిమెంట్ కోట్లు, లక్షల్లో సిమెంట్ బస్తాలను విక్రయించింది. వీటిలో లక్షల్లో ఇళ్ళు తయారై ఉంటాయి. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటనే ఆందోళన కలుగుతోంది.
ఇది కూడా చదవండి: రెండో రోజూ బేర్ విలవిల..400 పాయింట్ల దిగువకు సెన్సెక్స్
కల్తీ దానికి తోడు పన్ను ఎగవేత..
కర్నూలుకు చెందిన మహేష్ అనే వ్యక్తి లేపాక్షి సిమెంట్ అనుమతులతో లైసెన్స్ తీసుకున్నాడు.మారుమూల ప్రాంతమైన గోరంట్ల మండలం గుత్తివారి పల్లి కేంద్రంగా నకిలీ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసి యథేచ్ఛగా నకిలీ సిమెంట్‌ను సరఫరా చేస్తున్నాడు. ఈ కల్తీపై పక్కా సమాచారం అందుకున్న విజిలెన్స్ దాడులు చేయగా మొత్తం బాగోతం బయటపడింది. దీంతో కస్తూరి సిమెంట్ యజమాని మహేష్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు ఏడు కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. నిబంధనలు అతిక్రమించడంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కమర్షియల్ ట్యాక్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖల అధికారులు తెలిపారు. ఈ నేరంతో పాటూ కస్తూరీ సిమెంట్స్ ప్రభుత్వానికి కోట్లలో పన్నులు కట్టకుండా కూడా మోసం చేసింది. దీనిపైనా అధికారులు కేసులు నమోదు చేశారు.
Also Read: భారత్ కు క్యూ కడుతున్న కంపెనీలు.. అమెజాన్ భారీ పెట్టుబడులు..10 లక్షల ఉద్యోగాలు
Follow Us