Israel Hamas War: హమాస్ పై ఇజ్రాయెల్ భీకర దాడి..యహ్యా సిన్వర్ సోదరుడు మృతి
హమాస్ కమాండ్ సెంటర్ పై ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఈ భీకర దాడిలో హమాస్ టాప్లీడర్, యాహ్యా సిన్వార్ సోదరుడు మహమ్మద్ సిన్వర్ మృతి చెందినట్లు తెలుస్తోంది.
హమాస్ కమాండ్ సెంటర్ పై ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఈ భీకర దాడిలో హమాస్ టాప్లీడర్, యాహ్యా సిన్వార్ సోదరుడు మహమ్మద్ సిన్వర్ మృతి చెందినట్లు తెలుస్తోంది.
భారత్-పాక్ ఉద్రిక్తతల నడుమ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మరింత భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. ఆయనకు ఒక ప్రత్యేకమైన బుల్లెట్ ప్రూఫ్ కారుతో భద్రత కల్పించారు. దాంతో పాటూ ఆయన ఇంటి చుట్టూ కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీలు ఈరోజు శుభారంభాన్ని ఇచ్చాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలున్నా దేశీ మార్కెట్ సూచీలు మాత్రం పరుగులు తీస్తున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 81,550 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా పెరిగింది.
కాశ్మీర్ పై తమది ఎప్పుడూ ఒకటే మాట అని చెబుతోంది భారత్. పాక్ అక్రమంగా ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి ఇచ్చే వరకూ తమ వైఖరి మారదని భారత విదేశాంగ శాఖ మరోసారి స్పష్టం చేసింది. ఈ సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని అనుకుంటున్నామని చెప్పింది.
భారత్, పాక్ కాల్పుల విరమణకు తానే కారణమని అదే పాట మళ్ళీ పాడారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. హింసను తగ్గించడానికి వాణిజ్య ఒప్పందాలను ఉపయోగించానని...ఇరు దేశాల నాయకులను ఒప్పించానని చెప్పుకొచ్చారు.
యూరప్ దేశమైన గ్రీస్ లో నిన్న అర్థరాత్రి భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.1 మాగ్నిట్యూడ్ గా నమోదైంది. గ్రీస్ తో పాటూ కైరో, ఈజిప్ట్, ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ. జోర్డాన్ లలో భూమి కంపించింది.
ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దీనిపై పాకిస్తాన్ స్పందించింది. శాంతి కోసం అంతర్జాతీయ స్థాయిలో కృషి జరుగుతుంటే..భారత ప్రధాని చెసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలను పెంచేలా ఉన్నాయని పాక్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.
కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత్, పాకిస్తాన్ విదేశాంగ శాఖలు ప్రకటించాయి. కానీ ఈ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తోంది. ఇది అత్యంత దారుణమైన విషయమని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్సి మండిపడ్డారు. భారత్ దీనికి ధీటుగా జవాబిస్తుందని అన్నారు.
కాల్పులు విరమణ జరిగింది కానీ...ఉగ్రవాదుల దాడులు మాత్రం ఆగలేదు. భారత్ లో తాజాగా మరో ఉగ్రదాడి జరిగింది. జమ్మూలోని నాగ్రోట దగ్గర సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేశారు.. ఇద్దరు టెర్రరిస్టులను చంపారనివార్తలు వచ్చాయి. అయితే దీనిని రక్షణ శాఖ ఖండించింది.