/rtv/media/media_files/2025/05/10/rHRprQBVS0XBq2idbiV7.jpg)
Foreign Secretary Vikram Misri
భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్సి, సైనికాధికారులు కలిసి ఆపరేషన్ సింధూర్ మీద ప్రేస్ బ్రీఫింగ్ ఇచ్చారు. ఇందులో మొదటి రోజు నుంచి కాల్పులు విరమణ వరకు జరిగిన అన్ని దాడులను, సంఘటనలూ అధికాలు వివరించారు. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లు అన్నింటినీ వివరించారు.
ఒప్పందాన్ని ఉల్లంఘించడం దారుణం..
సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. ఒకసారి ఒప్పందం చేసుకున్న దానిని తప్పడం చాలా దారుణమని ఆయన అన్నారు. డీజీఎంవో మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. కొన్ని గంటలుగా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, ఇది అత్యంత దుర్మార్గమని విక్రమ్ మిస్రీ మండిపడ్డారు. దీనికి పూర్తి బాధ్యత పాక్ దేనని అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న ఈ దాడులకు భారత్ తగిన విధంగా జవాబిస్తుందని చెప్పారు. భారత సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చామని..పాక్ సైన్యంపై ఎలాంటి చర్యలనా తీసుకవచ్చిన విక్రమ్ తెలిపారు. పాకిస్తాన్ ఇప్పటికైనా దాడులను ఆపితే బావుంటుందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి అన్నారు.
For the last few hours, there have been repeated violations of the understanding arrived at earlier this evening between DGMOs of India & Pak...: Foreign Secretary Vikram Misri Briefs Media
— TIMES NOW (@TimesNow) May 10, 2025
Watch Live: https://t.co/01G4Ar9gvW pic.twitter.com/tXG4iAjZUr
today-latest-news-in-telugu | pakistan