Jaishankar's Security Upgraded: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. జైశంకర్ కు బుల్లెట్ ప్రూఫ్ కారు

భారత్-పాక్ ఉద్రిక్తతల నడుమ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మరింత భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. ఆయనకు ఒక ప్రత్యేకమైన బుల్లెట్ ప్రూఫ్ కారుతో భద్రత కల్పించారు. దాంతో పాటూ ఆయన ఇంటి చుట్టూ కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 

New Update
Jai shankar

Jai shankar

Jaishankar's Security Upgraded: ఇప్పటికే జడ్ ప్లస్ కేటగిరీ(Z+ Catogery) భద్రత ఉన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు తాజాగా మరింత భద్రతను పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత(India Pakistan War) నేపథ్యంలో ఈ ఏర్పాట్లను చేయడంతో దీనికి మరింత ప్రాధాన్యత చేకూరింది. జైశంకర్‌కు ఇప్పటికే సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ కమాండోలతో కూడిన జడ్‌-కేటగిరీ భద్రత కొనసాగుతోంది.  ఇప్పుడు దాన్ని మరింత పెంచారని సమాచార. 33 మంది కమాండోలు ఎల్లప్పుడూ ఆయనకు రక్షణ వలయంగా ఉండనున్నారు. దాంతో పాటూ ఒక ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కారును(Bullet Proof Car) కూడా జైశంకర్ కాన్వాయ్ లో చేర్చనున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  

Also Read: 'ఈట్.. స్లీప్.. సలార్'.. బొమ్మ వచ్చి 500 రోజులు దాటినా ఊపు తగ్గలేదుగా!

 

కట్టుదిట్టమైన భద్రత..

విదేశాగ మంత్రి జైశంకర్ కు ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి కేంద్రానికి ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చింది. అందుకనే ఇప్పుడు ఆయనకు మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. 2023 అక్టోబరులో ఆయనకున్న వై కేటగిరీ భద్రతను జడ్‌ కేటగిరీకి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి ఆయన భద్రతను పెంచారు. 

Also Read: ఈ రేంజ్ కలెక్షన్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా! #సింగిల్ వరల్డ్ వైడ్ ఎంతంటే..?

 

Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్‌ కూడా మేమే

today-latest-news-in-telugu | s-jaishankar

Also Read: Stock Market: లాభాల్లోకి స్టాక్ మార్కెట్..సెన్సెక్స్ 300 పాయింట్లు పైకి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు