/rtv/media/media_files/2025/05/14/fvehgoBapFZTdNQLLJmn.jpg)
Mohammad Sinwar
Israel Hamas War: దక్షిణ గాజాలోని(Gaza) ఖాన్ యూనిస్ పై ఇజ్రాయెల్ ఆర్మీ(Israel Army) మరోసారి భీకర దాడులు చేసింది. హమాస్ కమాండ్ సెంటర్(Hamas Command Center) పై ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఖాన్ యూనిస్ లో ఐరోపా హాస్పిటల్ కింద భూగర్భంలో హమాస్ కమాండ్ సెంటర్ ఉంది. దీనిపై ఇజ్రాయెల్ దళాలు గురి చూసి దాడులు చేశాయి. ఇందులో హమాస్ టాప్‌లీడర్, యాహ్యా సిన్వార్(Yahya Al-Sinwar) సోదరుడు మహమ్మద్ సిన్వర్(Mohammed Sinwar) మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఐడీఎఫ్ ఇప్పటి వరకూ ఏమీ ప్రకటన చేయలేదు. మరోవైపు గాజాలోని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ మాత్రం ఇజ్రాయెల్ దాడిలో సుమారు 28 మంది ప్రజలు మరణించినట్లు చెబుతున్నారు. ఆ సంస్థ ప్రతినిధి మహమ్మద్ బస్సాల్ మాట్లాడుతూ...ఇప్పటి వరకు 28 మంది మృతదేహాలను గుర్తించామని చెప్పారు.
Also Read: 'ఈట్.. స్లీప్.. సలార్'.. బొమ్మ వచ్చి 500 రోజులు దాటినా ఊపు తగ్గలేదుగా!
హమాస్ తమ ఆయుధాలను వదిలేసి, బందీలను విడుదల చేసేవరకు దాడులు ఆపమని ఇజ్రాయెల్ చెబుతోంది. మరోవైపు హమాస్ కూడా ఇజ్రాయెల్ యుద్ధం ఆపేవరకు ఆయుధాలు వదలడం లేదా బందీల విడుదల చేయమని అంటోంది.
Khan Yunis, Gaza.
— Erez Neumark 🇮🇱🇧🇪 (@ErezNeumark) May 13, 2025
IDF strike on Hamas leaders meeting in an underground command center located below the European hospital.
Cautious optimism that Hamas leader Mohammad Sinwar was eliminated. #Israel #Hamas pic.twitter.com/ItLrqvhdNK
మహమ్మద్ సిన్వర్...
హమాస్ టాప్‌లీడర్ యాహ్యా సిన్వార్ సోదరుడు మహమ్మద్ సిన్వర్. ఇతను కూడా హమాస్ మిలటరీ వింగ్ లో చాలా కాలంగా పని చేస్తున్నాడు. అయితే ఇతను పెద్దగా బయటకు కనించలేదు. యహ్యా చనిపోయిన తరువాత మహమ్మద్ కు నాయకత్వ బాధ్యతలు ఇచ్చారని చెబుతున్నారు. తన సోదరుడి అడుగు జాడల్లో మహమ్మద్ అయితేనే గ్రూప్ వ్యూహాలను కొనసాగించగలుగుతాడని భావించారు. యహ్యా సిన్వర్ తరువాత మహమ్మద్ సిన్వర్ ఇజ్రాయెల్ టైప్ లిస్ట్ లిస్ట్ లో ఉన్నాడు. ఇతని కోసం ఐడీఎప్ బలగాలు చాలా రోజుల నుంచి వెతుకుతున్నాయి.
Also Read: ఈ రేంజ్ కలెక్షన్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా! #సింగిల్ వరల్డ్ వైడ్ ఎంతంటే..?
today-latest-news-in-telugu
Also Read: jai Shankar: భారత్-పాక్ ఉద్రిక్తతలు..జైశంకర్ కు బుల్లెట్ ప్రూఫ్ కారు