/rtv/media/media_files/2024/10/22/YnbP6Gz876OArgI9SEYa.jpg)
wine shops closed in hyderabad
మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. మరొక్క రోజు ఆగితే.. మద్యం దుకాణాలన్నీ మూతపడనున్నాయి. ఒక్క మద్యం షాపులు మాత్రమే కాకుండా.. కళ్లు దుకాణాలు కూడా మూసేస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే. ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా నగర కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: సన్నటి కనుబొమ్మలతో ఇబ్బంది పడుతున్నారా..ఇలా చేస్తే మందంగా పెరుగుతాయి
Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..
Wine Shops Closed In Hyderabad
హనుమాన్ జయంతి రోజున హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వైన్ షాపులు అన్నీ క్లోజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 12 వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలతో పాటు కల్లు షాప్‌లు, బార్‌లు కూడా మూసివేయాలని తెలిపారు.
ఇది కూడా చదవండి: అతిగా ఆలోచించడం వల్ల కలిగే సమస్యలు
ఈ ఆదేశాలు జంటనగరాల్లో అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కావున ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఇందులో భాగంగా హనుమాన్ జయంతి ఉత్సవాన్ని ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని తెలిపారు. కాగా ఇటీవల జరిగిన శ్రీరామ నవమి సందర్భంగా కూడా రాష్ట్రవ్యాప్తంగా వైన్‌షాపులను మూసేసిన విషయం తెలిసిందే.
Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా?
latest-telugu-news | wine-shops-closed-in-telangana | wine-shops-closed | today-news-in-telugu | latest telangana news | telangana news today | breaking news in telugu