Mahesh Babu: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ధర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న “SSMB29” మూవీని 2027 మార్చి 25న విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారట రాజమౌళి. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చుతున్నారు.

New Update
ssmb 29 movie updates

ssmb 29 movie updates

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ధర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న “SSMB29” చిత్రం షూటింగ్ శర వేగంగా సాగుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చుతున్నారు. ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..

ఇటీవ‌ల ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లాలో రెండో షెడ్యూల్‌ను పూర్తిచేసిన మూవీ టీమ్, ఇప్పుడు తదుపరి షెడ్యూళ్లకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా, సినిమా విడుదల తేదీపై(SSMB29 Release Date) ఇప్పుడు ఆసక్తికర సమాచారం హల్‌చల్ చేస్తోంది.

Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

2027 మార్చి 25న..?

సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఈ చిత్రాన్ని 2027 మార్చి 25న విడుదల చేయాలనే యోచనలో రాజమౌళి ఉన్నారట. ఇదే తేదీన 2022లో విడుదలైన "RRR" ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించడంతో, ఆ డేట్ రాజమౌళికి ప్రత్యేకమైన సెంటిమెంట్ అయిపోయిందట. అదే సెంటిమెంటుతో మహేష్ బాబు సినిమా విడుదలను కూడా అదే రోజున ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Also Read: Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!

లేటెస్ట్ టెక్నాలజీ  తో భారీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీని దాదాపు రూ.1500 కోట్లు బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్నారు. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి మహేష్- జక్కన్న కాంబో మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి!

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు