/rtv/media/media_files/2025/04/10/F7SPKMR2xjzHTFZBmOme.jpg)
NTR Neel
NTR Neel: RRR వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దేవర సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కమర్షియల్ హిట్ సాధించాడు. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనిపించుకుంది. దేవర రిలీజ్ టైమ్ కి వేరే సినిమాలేవీ పోటీ లేకపోవడంతో మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. అయితే ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న హై ఆక్టేన్ యాక్షన్ డ్రామాలో నటించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది.
Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో
ఏప్రిల్ 9, 2026..
భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న NTR 31 ఏప్రిల్ 9, 2026న ప్రేక్షకుల ముందుకు రానుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ మొదట్లో ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు, కానీ షూటింగ్ ఆలస్యం కారణంగా విడుదల తేదీలో మార్పులు చేసారు.
Tomorrow 12:06 PM… Stay tuned. #NTRNeel
— #NTRNeel (@NTRNeelFilm) April 8, 2025
Also Read: Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!
అయితే ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి బస్రూర్ సంగీతం సమకూర్చనున్నారు.
Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?
Also Read: TTD: ఒంటిమిట్ట రాములోరి గుడికి.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు!