BIG BREAKING: కళ్లు తిరిగి పడిపోయిన కొండా సురేఖ
తెలంగాణ మంత్రి కొండా సురేఖ సచివాలయం వద్ద కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో వైద్యాధికారులు ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. లో బీపీ కారణంగా ఇలా జరిగినట్లు వైద్యులు తెలిపారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ సచివాలయం వద్ద కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో వైద్యాధికారులు ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. లో బీపీ కారణంగా ఇలా జరిగినట్లు వైద్యులు తెలిపారు.
హనుమకొండలో ఉప్పులపల్లిలో ప్లాస్టిక్ బాటిల్స్‌తో బస్‌షెల్టర్‌ను నిర్మించారు. గ్రామంలో ప్లాస్టిక్ బాటిళ్లు ఎక్కువ కావడంతో ఎంపీడీవో పల్లవి బస్ షెల్టర్ నిర్మించాలని సూచించారు. ఇది చూసినవారు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కలుగుతుందని అంటున్నారు.
పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ప్రేమ జంటపై దాడి జరిగింది. బుధవారం సాయంత్రం వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రేమ పెళ్లి వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై అమ్మాయి బంధువులు దాడికి పాల్పడ్డారు.
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహామ్మారి మరోమారు తన ప్రతాపాన్ని చూపుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదువుతుండగా తాజాగా వరంగల్ లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం కలకలం సృష్టించింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సమీపంలో ఆరు కరోనా కేసులను నిర్ధారించారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత వెళ్లరని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ప్రకటించారు. కేసీఆర్ నా దేవుడు అని.. నా నాయకుడు అని కవిత మొదటి నుంచి చెబుతున్నారన్నారు. ఇదంతా టీ కప్పులో తుపాను లాంటిదని అన్నారు.
పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు బీఆర్ఎస్ Vs కాంగ్రెస్ గా మారింది. BRS పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటుండగా.. కాంగ్రెస్ నేతలు మాత్రం కొత్త విగ్రహాన్నే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నేత SI కాలర్ పట్టుకున్నాడు.
'SSMB 29' సినిమా పేరుతో వరంగల్ కి చెందిన వ్యాపారికి రూ. 15.9 లక్షల టోపీ పెట్టాడు ఓ మోసగాడు. సినిమాలో ఆర్ట్ డిపార్మెంట్ మేనేజర్ గా ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు లాగాడు. దీనిపై బాధితుడు వరంగల్ సైబర్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా..
విజయనగరం కేంద్రంగా ఉగ్రకుట్రకు తెరలేపిన సిరాజ్ టీం కు సంబంధించిన 20 మందికోసం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. కాగా వరంగల్ లో ఈ బృందానికి సంబంధించిన ఉగ్రవాద కదలికలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ, నాయకత్వంపై కవిత చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఫైర్ అయ్యారు. ఆమెకు అంత ఆవేశం ఎందుకు? అని ప్రశ్నించారు. కొంచెమైనా ఓపిక ఉండాలన్నారు. కేసీఆర్ కవితకే కాదు లక్షలాది మందికి దేవుడని అన్నారు.