/rtv/media/media_files/2025/07/11/warangal-mgm-hospital-2025-07-11-21-03-47.jpg)
MGM Hospital
MGM Hospital : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా మృతదేహలు మారిన ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.చనిపోయాడని అంత్యక్రియలకు సిద్ధమైన బంధువులకు పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చారు. చనిపోయాడని భావించిన కుమారస్వామి బతికే ఉన్నాడని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆయన ఎంజీఎం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఉన్నారని వెల్లడించారు.మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గోక కుమారస్వామి రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. మూడు రోజులు చికిత్స పొందిన తర్వాత మరణించాడని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. పోస్టుమార్టం అనంతరం శవాన్ని బంధువులకు అప్పగించారు. మృతదేహన్ని తీసుకెళ్లిన వారు అంత్యక్రియలు చేయడానికి సిద్ధమయ్యారు.
Also Read: చనిపోయిందనుకుని అంత్యక్రియలు.. ఆఖరి నిమిషంలో లేచి గుక్కపెట్టి ఏడ్చిన శిశువు!
శ్మశానవాటిక వరకు తీసుకెళ్లిన తర్వాత చివరి చూపు చూసేందుకు శవపై కప్పిన క్లాత్ ను తొలగించి చూశాక అంతా షాక్ అయ్యారు. అతను మా నాన్న కాదని కుమారస్వామి కూతురు స్పష్టంగా చెప్పడంతో తిరిగి శవాన్ని మార్చూరీకి చేర్చారు. అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పాటు అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎంక్వయిరీ ప్రారంభించారు. ప్రమాదానికి గురైన కుమారస్వామిని గురించి ఆసుపత్రిలో విచారించగా ఆయన బతికే ఉన్నాడని, చికిత్స పొందుతున్నాడని తేలింది. ఆయన అపస్మారక స్థితిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తేలింది. దీంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:మర్డర్ కేసు.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!
ఇక వారికి ఇచ్చిన మృతదేహం ఎవరిది? తప్పు ఎక్కడ జరిగింది అనే విషయంలో పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు. మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ సమస్య తలెత్తినట్లు భావిస్తున్న పోలీసులు ఆ కోణఃలోనూ విచారణ చేపట్టారు. కాగా మృతదేహలను ఇలా ఇష్టానుసారం తారుమారు చేస్తున్న సిబ్బందిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.