/rtv/media/media_files/2025/04/30/kgPrmt7LBZoWZu7rnUMd.jpg)
Heart Attack
ప్రస్తుత కాలంలో గుండె పోటుతో ఎక్కువగా మరణిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా గుండె పోటుతో మృతి చెందుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు గుండె పోటుతో చనిపోతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల గుండె పోటు బారిన పడుతున్నారు. ఈ మధ్య కాలంలో అయితే వీరి సంఖ్య బాగా పెరిగింది.
ఇది కూడా చూడండి:Vivo X200 FE: అబ్బా తమ్ముడూ.. Vivo నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. కెమెరా సూపరెహే!
గుండె పోటుతో విద్యార్థి..
కాలేజీలో క్లాస్ వింటూ, డ్యాన్స్ వేస్తూ, ఆడుతూ, తినేటప్పుడు ఇలా ఎందరో గుండె పోటుతో మృతి చెందారు. ఇటీవల హనుమకొండలో కూడా ఇలాంటి విషాద ఘటన జరిగింది. హనుమకొండలోని కరుణాపురం గ్రామంలో జ్యోతిబాఫూలే బాలుర గురుకులంలో మణిదీప్(17) గుండెపోటుతో మృతి చెందాడు. ఇతను ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మణిదీప్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇది కూడా చూడండి:Axiom-4 mission: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!
ఇదిలా ఉండగా.. బీహార్‌లో పట్టపగలు సుల్తాన్‌గంజ్ పోలీసు స్టేషన్‌కు కేవలం 300 మీటర్ల దూరంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. జితేందర్ కుమార్ అనే న్యాయవాదిపై కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టపగలే కాల్పుల ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు భయా భ్రాంతులకు గురయ్యారు. స్థానికంగా గుర్తింపు పొందిన లాయర్ జితేందర్ కుమార్ రెగ్యులర్‌గా టీ తాగే షాపులో టీ తాగి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.అనంతరం దుండుగులు అక్కడి నుంచి పరారైనట్టు పాట్నా ఈస్ట్ ఎస్పీ పరిచయ్ కుమార్ తెలిపారు.
ఇది కూడా చూడండి:Radhika Yadav: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు
తీవ్రంగా గాయపడిన లాయర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందినట్టు చెప్పారు. ఘటనా స్థలం నుంచి మూడు ఖాళీ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేశామని, అన్ని కోణాల్లోంచి విచారణ చేస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా హంతకులను పట్టుకుంటామని అన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్‌లో గత 24 గంటల్లో చోటు చేసుకున్న కాల్పుల సంఘటనల్లో నలుగురు మరణించడం స్థానికంగా కలకలం సృష్టించింది.
ఇది కూడా చూడండి:BIG BREAKING: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!
hanmakonda | heart-attack | latest-telugu-news | latest telangana news | today-news-in-telugu