ఓ మనిషి చనిపోతే అయ్యో పాపం అంటూ ఏడుస్తారు. కన్నీళ్లతో చివరిసారి చూసుకుని అంత్యక్రియలు చేస్తారు. కానీ ఇక్కడో వ్యక్తి కాదు గ్రామంలోని అందరూ సంతోషపడుతున్నారు. పీడ విరగడైందని ఏకంగా పండగ చేసుకుంటున్నారు. జనగామ జిల్లా పిట్టలోని గూడెంలో నరరూప కామాంధుడు కనకయ్యను అతన్ని కట్టుకున్న ఇద్దరు భార్యలు కొట్టి చంపేశారు. ఆ గ్రామానిరి ఓ కామాంధుడి నుంచి విముక్తి కల్పించారు. కనకయ్యపై మృతి పట్ల గ్రామస్తుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. దుర్మార్గుడు చచ్చిపోయాడంటూ సంతోష పడుతున్నారు. సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కనకయ్య మనిషి కాదు.. కామ మృగమంటూ మహిళల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాడికి ఆడది కనిపిస్తే, వాడి కన్ను పడితే ఖతమే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒంటరి మహిళ కనిపిస్తే
ఒంటరి మహిళ కనిపిస్తే వేటాడుతాడని, కనకయ్య కంటికి కనిపించకుండా ఇన్నాళ్లు తిరిగామంటున్నారు గ్రామస్తులు. చిన్న పిల్లలను కూడా బడికి పంపించకుండా తమ తల్లిదండ్రులు ఇంట్లోనే తాళం వేసి కాపాడుకున్నారు. అతని కామానికి కన్న తల్లి, చెల్లి, అత్త, నానమ్మ ఇలా చాలా మంది బలయ్యారంటూ చెబుతున్నారు. దాదాపు 40 మంది మహిళలపై కనకయ్య అఘాయిత్యానికి పాల్పడినట్లుగా గ్రామస్తులు అంటున్నారు. ఓ దరిద్రుడు, కామ మృగం పోయిందని గ్రామస్తులు సంతోషంగా దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. ఓ కేసు విషయంలో కూడా అతను పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. మా ఊరి, దరిద్రం పోయిందని గ్రామస్తులు సంతోషంగా పండగ చేసుకుంటున్నారు.