/rtv/media/media_files/2025/07/12/warangal-mgm-hospital-2025-07-12-11-02-57.jpg)
Warangal MGM Hospital
Warangal MGM Hospital:
రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలయిన ఒక వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయనకు ఫోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. తమ ఆత్మీయున్ని కోల్పోయిన బంధువులు, స్నేహితులు అంతా పార్థివదేహం చుట్ట చేరి కన్నీటి పర్యంతమయ్యారు. అంతా వచ్చాక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. దుంఖంతో కూడుకున్న బాధలో శవాన్ని స్మశానానికి తరలించారు. దహన సంస్కారాలు చేయమే ఆలస్యం. చివరిసారిగా మృతుని మొఖం చూడాలన బంధువులు సంకల్పించారు. అనుకున్నట్లే శవానికి చుట్టిన వస్త్రాన్ని తొలగించారు.అంతే అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ శవం వారికి సంబంధించింది కాదు. వివరాల ప్రకారం..
Also Read: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్
వరంగల్ జిల్లా మైలారం గ్రామానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి తొర్రూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మూడు రోజుల పాటు చికిత్స పొందిన కుమారస్వామి ఈ రోజు ఉదయం మరణించాడు. దీంతో ఫార్మలిటీస్ అన్ని పూర్తి చేసి డెడ్ బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు. శవాన్ని తీసుకుని ఇంటికి వెళ్లిన వారు దహన సంస్కారాలు నిర్వహంచే సమయంలో అది కుమారస్వామిది కాదని గుర్తించారు. దీంతో హుటాహుటినా మళ్లీ ఆసుపత్రికి చేరుకున్నారు. మార్చురీ సిబ్బంది నిర్లక్షంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఈ ఘటనతో మరోసారి భయటపడింది. మార్చూరీ సిబ్బంది చేసిన తప్పిదాన్ని తెలుసుకుని అందరూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు.
Also Read: రక్తపోటు పెరగడానికి ఈ అలవాట్లే కారణమా..?ఈ రోజే దానిని తరిమి వేయండి..!!