Crime News : వరంగల్‌లో కలకలం..మైనర్ బాలుడి కిడ్నాప్..డబ్బుకోసం హింసించి...

డబ్బులకోసం ఒక మైనర్‌ బాలున్ని కిడ్నాప్‌ చేసి హింసించిన ఘటన వరంగల్‌ జిల్లా హనుమకొండలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా కేసులో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

New Update
Kidnapping of a minor boy

Kidnapping of a minor boy

Crime News : డబ్బులకోసం కొంతమంది దేనికైన తెగిస్తున్నారు. అయినవారైన వదిలిపెట్టడం లేదు. తాజాగా డబ్బులకోసం ఒక మైనర్‌ బాలున్ని కిడ్నాప్‌ చేసి హింసించిన ఘటన వరంగల్‌ జిల్లా హనుమకొండలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా కేసులో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారివద్దనుంచి ఒక ఆటో, కత్తి, రెండు పెట్రోల్ బాటిళ్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితులు.. పూరి పద్మ, పూరి రాజు @ నరేష్, జెట్టి జ్యోతి ఉండగా మరో నిందితుడు శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు.

ఇది కూడా చూడండి:Radhika Yadav: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు

హనుమకొండ ఏసీపీ నరసింహారావు ఈ కేసుకు సంబంధించి మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. ప్రధాన నిందితురాలైన పద్మ గతంలో హనుమకొండలోని బ్రాహ్మణవాడలో ఉన్న క్యాటరింగ్ సంస్థలో పనిచేసింది. ఆ సంస్థను రమణ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో రమణతో ఆర్థిక వివాదాల ఏర్పడ్డాయి. ఈ  నేపథ్యంలో పద్మ తన కుమారులు రాజు, శ్రీకాంత్‌లతో పాటు మరో మహిళ జ్యోతి సహాకారంతో రమణ బంధువైన మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు పథకం వేసింది. జూలై 4న బాలుడు ద్విచక్ర వాహనంపై బయటికి వెళ్లడాన్ని గమనించిన ఈ ముఠా నయీం నగర్ ప్రాంతంలో అతన్ని అడ్డుకున్నారు. అనంతరం బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని అశ్వాపురం తరలించారు.

Also Read: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..రంగంలోకి జాతీయ మహిళా కమిషన్

 అక్కడి నుంచి కొత్తగూడెం, మంగపేట ప్రాంతాల్లో అతన్ని రహస్యంగా దాచి ఉంచారు. అనంతరం అతని తల్లికి ఫోన్ చేయించి 12 లక్షలు డిమాండ్ చేశారు. అయితే తల్లి డబ్బులు పంపించకపోవడంతో బాలుడిని తీవ్రంగా హింసించారు.
అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వారికోసం వలపన్నారు. ఈ క్రమంలో  ఈరోజు ఉదయం ములుగు రోడ్ అవుటర్ రింగ్ రోడ్డులో నిందితులు బాలుడితో కలిసి ఆటోలో వెళుతుండగా యాదవనగర్ పెట్రోల్ బంక్ వద్ద వాహన తనిఖీలు చేస్తున్న హనుమకొండ పోలీసులు గమనించారు. పోలీసులను  చూసి  వారు ఆటో వదిలి పారిపోవడానికి యత్నించారు. అయితే, పోలీసులు పద్మ, రాజు, జ్యోతిని చాకచక్యంగా పట్టుకున్నారు. శ్రీకాంత్ పారిపోయాడు. బాలుడిని సురక్షితంగా రక్షించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇది కూడా చూడండి:Chhangur Baba : హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయడానికి ముస్లింలకు నిధులు.. ఛంగూర్ బాబా అరాచకాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు