/rtv/media/media_files/2025/06/08/nx3nm8VngKsR18LpWTGa.jpg)
Cabinet expansion
చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఈ రోజు జరిగింది. అయితే క్యాబినెట్లో ఆరు బెర్తులు ఖాళీ ఉండగా కేవలం ముగ్గురికి మాత్రమే చోటు దక్కింది. ఇందులోనూ సామాజిక వర్గాల వారిగా ఎస్సీ మాల, మాదిగ, బీసీలకు ఒకటి కేటాయించారు. అయితే మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని మొదటి నుంచి ఆశలు పెట్టుకున్న పలువురు తమకు పదవులు దక్కకపోవడంతో రాజీనామాకు సిద్ధపడ్డారు. దీంతో అధిష్టానం వారిని బుజ్జగించేందుకు సిద్ధమైంది.
Also Read : ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి
Telangana Cabinet Expansion
ముఖ్యంగా నిజామాబాద్‌కు చెందిన సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులు తమకు క్యాబినెట్లో చోటు దక్కుతుందని ఆశించారు. కానీ వారికి అవకాశం రాలేదు.ఈ సారి తమకు మంత్రి పదవి ఖాయమని నమ్మిన ఈ ముగ్గురు ఇదే విషయాన్ని తరచూ అనుచరులు, కార్యకర్తలతో చెప్పుకుంటూ వచ్చారు. చివరి నిమిషంలో అధిష్టానం వారికి మొండిచేయి చూపడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.
Also Read : తెలంగాణలో ఉరుములు మెరుపులతో దంచికొడుతున్న వర్షం.. ఈ జిల్లాల్లో దారుణం! (వీడియో)
ఈ క్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధిష్టానం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అన్ని పార్టీలు మారిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి పదేండ్లుగా జిల్లాలో పార్టీని కాపాడుతూ వస్తున్న తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా నుంచి తనకు అవకాశం వస్తుందని ఆశించిన సుదర్శన్ రెడ్డి కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఖరాఖండిగా చెప్పారు. ఇక రాజగోపాల్ రెడ్డికి అవకాశం లేనప్పటికీ ఆశ పెట్టుకున్నారు. కానీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.
Also Read : HYDలో దారుణం.. శవాన్ని దహనం చేస్తుండగా ఎగసిపడిన నిప్పురవ్వలు - ఊరు ఊరంతా భయంతో పరుగులు!
ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం ఆ ముగ్గురిని బుజ్జగించే పనిలో పడింది. ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్‌లు ముందుగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయనతో చర్చించారు. ముందు ముందు అవకాశాలు వస్తాయని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులతోనూ మాట్లాడడానికి ఈ నాయకులు ప్రయత్నిస్తున్నారు.
Also Read : కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారంపై బిగ్ అప్డేట్!
New Ministers in Telangana Cabinet | congress | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-updates