OG MOVIE: పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఓజీ' ఒకటి. ప్రభాస్ 'సాహూ' డైరెక్టర్ సుజీత్- పవన్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ''
దిల్ రాజ్ భారీ ఆఫర్
ఈ నేపథ్యంలో 'ఓజీ' థియేట్రికల్ రైట్స్ కి డిమాండ్ భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ సినిమా హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా నైజాం ఏరియా హక్కుల కోసం పోటీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏషియన్ సినిమాస్ సునీల్, దిల్ రాజు, మైత్రీ మేకర్స్ నైజం హక్కుల కోసం తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. వీరిలో నిర్మాత దిల్ రాజ్ నైజం హక్కులను దక్కించుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
#OG Distributors :
— Srujan Chowdaryー🇮🇳 (@Bhargav_Bablu_) August 19, 2025
Nizam - Dil Raju
Ceeded - Trivikram Srinivas /Naga Vamsi
Guntur - RadhaKrishna Entertainments
East - Udhay + Anushree
West - Akarsh/LVR
UA - vigneshwara
Nellore - Vengamba
Krishna - Dheeraj Entertainments
Karnataka - Kumar Films#TheyCallHimOG#OGonSept25
ఇప్పటికే దిల్ రాజ్ ఒక మంచి నెంబర్ కూడా ఆఫర్ చేశారట. ఇది చూస్తుంటే నైజం రైట్స్ దాదాపు దిల్ రాజుకే దక్కే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. నైజాం హక్కుల కోసం దిల్ రాజు ఏకంగా రూ. 40 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇది నిజమైతే నిజాం ఏరియాలో ఇది రికార్డు స్థాయి ధర అవుతుంది. అయితే ట్రేడ్ నిపుణుల ప్రకారం నైజాం హక్కులు 60 నుంచి 63 కోట్ల మధ్య క్లోజ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి విడుదలకు ముందే 'ఓజీ' భారీ అంచనాలను పెంచుకుంటోంది. నైజాం ఏరియా హక్కుల డిమాండ్ సినిమాపై నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఇదిలా ఉంటే దిల్ రాజు గతంలో నిర్మించిన పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సెంటిమెంట్ తోనే దిల్ రాజ్ ఇప్పుడు 'ఓజీ' హక్కుల కోసం పట్టుబడుతున్నారని టాక్.
మాఫియా, గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో భారీ అంచనాలతో రూపొందుతున్న 'ఓజీ' సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇందులో కోలీవుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, అభిమన్యు సింగ్, శుభలేఖ సుధాకర్ వంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే హీరోయిన్ ప్రియాంక ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. 'కన్మణి ' అనే పాత్రలో ప్రియాంక నటిస్తోంది.
Also Read: Rasha Thadani: అప్పుడు మిస్.. ఇప్పుడు జాక్ పాట్! ఘట్టమనేని హీరోతో రవీనా టాండన్ కూతురు