Rain alert : తెలంగాణకు రెయిన్ అలెర్ట్...వర్షాలే వర్షాలు
ఎండలతో సతమవుతున్న తెలంగాణ వాసులకు వాతవరణ శాఖ గుడ్న్యూస్ చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని వెల్లడించింది.