/rtv/media/media_files/2025/06/07/7RQNpL3Jqt1gtCD6QNFA.jpg)
CM Stalin and PM Modi
CM Stalin - PM Modi:
దేశవ్యాప్తంగా జనాభా లెక్కింపు 2027(Census 2027) మార్చి 1 నుంచి జరగనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర అధికారిక వర్గాలు ప్రకటించాయి. జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేయనున్నట్లు పేర్కొన్నాయి. అయితే దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్(CM Stalin) స్పందించారు. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం కావాలనే జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ఆలస్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగణన ఆలస్యం అనేది దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చేస్తున్న దుష్టపన్నాగమేనని మండిపడ్డారు.
Also Read: ఉక్రెయిన్‌ను చావుదెబ్బ కొట్టిన రష్యా.. వందలాది డ్రోన్లు, క్షిపణులతో దాడులు
లోక్‌సభ నియోజకవర్గాలు ప్రస్తుతం ఉన్న 543తో కొనసాగినా, 848కి పెంచినా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుంది. తమిళనాడుకు మాత్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాలకు ఇది ప్రమాదకరం. వీటివల్ల ఎఫెక్ట్ అయ్యే రాష్ట్రాల డిమాండ్లను పరిష్కరిస్తామని కేంద్ర హోం మంత్రిత్వశాఖ చెప్పినప్పటికీ అవి అస్పష్టంగానే మిగిలిపోయాయి. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా కావాలని అక్కడి సీఎం ఒమర్ అబ్దుల్లా చాలాసార్లు కేంద్రాన్ని కోరారు. కానీ అది కేంద్రపాలిత ప్రాంతంగానే ఉండిపోయింది. కశ్మీర్‌లో ఎన్నికలు జరిగినా, రాష్ట్ర హోదా విషయంలో సుప్రీంకోర్టులో హామీలు ఇచ్చినా కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
Also Read: వాట్సాప్ కు పోటీగా ఎక్స్ చాట్..మస్క్ మరో ప్లాన్
కేంద్ర 2027 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దేశంలో ప్రజాస్వామ్య శక్తి బలహీనమవుతుంది. భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాలకు ఇది ముప్పు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. కానీ అన్నాడీఎంకే లాంటి పార్టీ ద్రోహులు తమ రాజకీయాల ప్రయోజనం కోసం బీజేపీ ముందు మోకరిల్లుతున్నారు. వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా కూడా డీఎంకే నేతృత్వంలోని తమిళనాడు ప్రజలు రాష్ట్ర పురోగతిని అడ్డుకోవడాన్ని ఉపేక్షించరని'' స్టాలిన్ అన్నారు.
Also Read: ది అమెరికా పార్టీ.. ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పేరు ఇదే..
Follow Us