Akhil Akkineni Wedding: అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని వివాహం ఈరోజు ఉదయం 3. 30 గంటలకు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ముంబైకి చెందిన తన ప్రేయసి జైనాబ్ ని వివాహం చేసుకున్నారు. గత ఏడాది నవంబర్ 26న నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. నాగార్జున నివాసంలో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అఖిల్ వివాహ వేడుక ప్రైవేటుగా, సన్నిహితుల మధ్య జరిగినప్పటికీ, మెగా, అక్కినేని కుటుంబాల నుంచి స్టార్స్ హాజరుకావడంతో దీనికి మరింత గ్లామర్ తోడైంది.
/rtv/media/media_files/2025/06/06/8zyOA6O8rCoEzJm0W33I.png)
Also Read: Shine Tom Chacko: ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ప్రముఖ నటుడి కారు.. తండ్రి దుర్మరణం!
చిరంజీవి ఫ్యామిలీ
చిరంజీవి కుటుంబంతో పాటు శర్వానంద్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, తదితరులు సందడి చేశారు. పెళ్లి సందడిలో నాగ చైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. సెలెబ్రెటీలతో పాటు క్రికెటర్ తిలక్ వర్మ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
/rtv/media/media_files/2025/06/06/SAa7OfY4P4kSwOiD59H3.png)
బరాత్ లో నాగార్జున, నాగచైతన్య డాన్స్
వివాహ వేడుకకు ముందు జూన్ 5న జరిగిన సంగీత్ వేడుకలో నాగార్జున, నాగ చైతన్య ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ సందడిగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు అభిమానుల నుంచి సెలెబ్రెటీల వరకు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Nag Chay Akhil 🔥🔥🔥#AkhilWedding pic.twitter.com/Fzmi4QsEb6
— Akhil Akkineni FC (@AkhilFreaks_FC) June 6, 2025
ఈ వివాహ వేడుక తర్వాత ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ నాయకుల కోసం జూన్ 8 ఆదివారం రోజున అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ రిషెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.