MLC ELECTIONS 2025: కమ్యూనిస్టులకు ఒక ఎమ్మెల్సీ సీటు.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం?

తెలంగాణ సీపీఐ కీలక నేతలు ఈ రోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఐకి ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటును కేటాయించాలని నేతలు కోరినట్లు తెలుస్తోంది.

author-image
By Nikhil
New Update
Telangana MLA Quota MLC Elections

Telangana MLA Quota MLC Elections

తెలంగాణ (Telangana) లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC ELECTIONS 2025) ఈ రోజు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనుంది. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ ఉంటుంది. అనంతరం ఈ నెల 20న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు. అయితే.. ప్రస్తుత బలబలాలను పరిశీలిస్తే కాంగ్రెస్ కు 4, బీఆర్ఎస్ కు 1 ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం ఉంది. ఐదు కన్నా ఒక్క నామినేషన్ ఎక్కువగా దాఖలైతే పోలింగ్ ఉంటుంది. లేకుంటే అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేసేందుకు సీఎం రేవంత్ ఈ రోజు ఢిల్లీ వెళ్లారు. హైకమాండ్ పెద్దలతో చర్చించి తుది జాబితాను ఖరారు చేయనున్నారు సీఎం రేవంత్.

Also Read :  అయ్యో.. ఆ రాక్షడు నా చెల్లిని కొట్టి చంపాడు.. మలక్‌పేట శిరీష కేసులో బిగ్ ట్విస్ట్!

Also Read :  తణుకులో అఘోరీ సంచలనం.. వాన్ని చంపేస్తానంటూ బీభత్సం!

అయితే.. కాంగ్రెస్ మూడు సీట్లకే పరిమితమై నాలుగో సీటును సీపీఐ లేదా ఎంఐఎంకు కేటాయించే ఛాన్స్ ఉందన్న చర్చ సాగుతోంది. ఈ రోజు సీపీఎం కీలక నేతలు చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ కావడం ఈ వార్తకు మరింత బలం చేకూరింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు రెండు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని సీపీఐ పట్టుబట్టింది. కానీ కాంగ్రెస్ మాత్రం కేవలం కొత్తగూడెం అసెంబ్లీ సీటును మాత్రమే కాంగ్రెస్ కు పొత్తుల్లో భాగంగా కేటాయించింది. అయితే.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ సీటును ఇస్తామని సీపీఐకి హామీ ఇచ్చింది కాంగ్రెస్. దీంతో ఇప్పుడు ఆ హామీని నెరవేర్చాలని సీపీఐ పట్టుబడుతోంది.

Also Read :  మార్చి నుంచే దంచికొట్టనున్న ఎండలు.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే వడదెబ్బే

మరో వైపు కాంగ్రెస్ లో దాదాపు డజన్ కు పైగా నేతలు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీపీఐకి ఇచ్చిన ఎమ్మెల్సీ హామీని ఇప్పుడు నెరవేరుస్తుందా? లేక మరికొన్ని రోజులు ఆగాలని కోరుతుందా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్ గౌడ్ తో భేటీ అయిన సీపీఐ నేతలు ఎమ్మెల్సీ పదవిని ఇప్పుడే ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ రోజు హైకమాండ్ పెద్దలతో భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ అంశంపై సైతం చర్చించనున్నట్లు గాంధీ భవన్ వర్గాల్లో్ చర్చ సాగుతోంది. 

ఆ ఎమ్మెల్సీ సీటు ఎవరికి?

ఒక వేళ కాంగ్రెస్ సీపీఐకి ఎమ్మెల్సీ టికెట్ ను కేటాయిస్తే.. అది ఎవరికి దక్కుతుందనే అంశంపై చర్చ సాగుతోంది. సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డికి ఆ ఎమ్మెల్సీని కేటాయించే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో హుస్నాబాద్ టికెట్ ను తమకు కేటాయించాలని సీపీఐ పట్టుబట్టింది. అక్కడి నుంచి చాడను బరిలోకి దించాలని భావించింది. కానీ కాంగ్రెస్ అందుకు నిరాకరించింది. దీంతో ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని సీపీఐలో చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది. 

Also Read :  కట్నాల గ్రంథంతో ప్రసాద్ పెళ్లికొచ్చిన తిప్పలు.. పెళ్లికాని ప్రసాద్ టీజర్ భలే ఉందిగా..

Advertisment
తాజా కథనాలు