Pelli Kani Prasad Teaser: కట్నాల గ్రంథంతో ప్రసాద్ పెళ్లికొచ్చిన తిప్పలు.. పెళ్లికాని ప్రసాద్ టీజర్ భలే ఉందిగా..

కమెడియన్ సప్తగిరి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ పెళ్లికాని ప్రసాద్ టీజర్ విడుదల చేశారు. సప్తగిరి పెళ్లి నేపథ్యంలో కామెడీ సన్నివేశాలతో టీజర్ ఆసక్తికరంగా సాగింది. రెబల్ స్టార్ ప్రభాస్ టీజర్ ను లంచ్ చేశారు. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి.

New Update

Pelli Kani Prasad Teaser:   టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న హాస్య నటుడు సప్తగిరి.. ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సప్తగిరి హీరోగా అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ  'పెళ్లి కాని ప్రసాద్'. ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా టీజర్ ని లాంచ్ చేశారు. 

'పెళ్లి కాని ప్రసాద్' టీజర్

‘ప్రసాద్‌ అనే నేను.. తాతముత్తాతల నుంచి ఫాలో అవుతున్న కట్నం శాసనాల గ్రంథంలోని రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్ కి కట్టుబడి ఉంటునని ప్రమాణం చేస్తున్నాను అంటూ సప్తగిరి డైలాగ్ తో టీజర్ ప్రారంభం అవుతుంది. పెళ్లి కోసం హీరో పడే పాట్లు, కట్నం విషయంలో తండ్రి కండీషన్లు వంటి అంశాలతో టీజర్ నవ్వులు పూయించింది. చివరికి హీరోకు పెళ్లయిందా?  పెళ్లి కోసం ప్రసాద్ పడిన తిప్పలేంటి?  లేదా పెళ్లి కోసం శాసనాల గ్రంథంలోని రూల్స్ బ్రేక్ చేశాడా? అనే నేపథ్యంలో స్టోరీ ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. 

Also Read: Oscar Awards 2025: జస్ట్ మిస్.. ప్రియాంక చోప్రా 'అనుజ' ను బీట్ చేసిన డచ్ ఫిల్మ్!

అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోప్రియాంకశర్మ కథానాయికగా నటించగా ..  మురళీధర్ గౌడ్, అన్నపూర్ణమ, వడ్లమాని శ్రీనివాస్, ప్రమోదిని, బాషా, లక్ష్మణ్ మీసాల, రోహిణి, రాంప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

Also Read: Oscar Awards 2025: వేశ్యతో ప్రేమలో పడిన కథ.. 'అనోరా' చిత్రానికి ఏకంగా ఐదు కేటగిరీల్లో ఆస్కార్ అవార్డు!

Advertisment
Advertisment
తాజా కథనాలు