BIG BREAKING: మోడీ సంచలన నిర్ణయం.. పాకిస్థాన్తో సంబంధాలు క్లోజ్!

జమ్ము కశ్మీర్‌లోని  పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువాత కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ తో  దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్లుగా వెల్లడించింది. పాక్ పౌరులును ఇండియాలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

New Update
modi-amit-shah

modi-amit-shah

జమ్మూ కశ్మీర్‌లోని  పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువాత కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ తో  దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్లుగా వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వెల్లడించారు. 28 మందిని బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో బుధవారం  భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అయింది. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు తెలిపారు.  

వారం రోజుల్లో వారి దేశానికి

పాక్ పౌరులు, పర్యటకులు ఎవరైనా ఇండియాలో ఉంటే వారం రోజుల్లో వారి దేశానికి వెళ్లాలని అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ ను వెంటనే నిలిపివేస్తున్నట్లుగా కేంద్రం తెలిపింది.  పాక్ పౌరులును ఇండియాలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లుగా, 1960 సింధు జలాల ఒప్పందం తక్షణమే నిలిపివేయబడుతుందని తెలిపింది. SAARC వీసా మినహాయింపు పథకం (SVES) వీసాల కింద పాకిస్తానీ పౌరులు భారత్ లో ప్రయాణించడానికి అనుమతించబడరు.

ప్రస్తుతం SVES వీసా కింద భారత్ లో ఉన్న ఏ పాకిస్తానీ పౌరుడైనా భారత్ ను విడిచి వెళ్ళడానికి 48 గంటల సమయం ఉంది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లోని రక్షణ, సైనిక, నావికాదళం, వైమానిక సలహాదారులను పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించారు. వారు భారత్ విడిచి వెళ్ళడానికి ఒక వారం సమయం ఇచ్చారు.  ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ నుండి భారత్ తన సొంత రక్షణ, నేవీచ వైమానిక సలహాదారులను ఉపసంహరించుకుంటుంది. సంబంధిత హైకమిషన్లలోని ఈ పోస్టులను కేంద్రం రద్దు చేసింది.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు