MMTS Trains: రూ.20 టికెట్‌తో గంటలో హైదరాబాద్‌ నుంచి యాదగిరి గుట్టకు...ఎంఎంటీఎస్‌ రైలు!

యాదగిరిగుట్ట ఆలయానికి హైదరాబాద్ నుంచి తక్కువ సమయంలో ఆలయానికి చేరుకోవచ్చు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ఘట్‌కేసర్ నుంచి యాదగిగుట్టకు MMTS ట్రైన్లు నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే సిద్ధమైంది.

New Update
mmts

ప్రతిరోజూ వేల మంది భక్తులు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటుంటారు. హైదరాబాద్‌కు కేవలం కూతవేటు దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి నగరం నుంచి రోజు దాదాపు 10 వేల మంది భక్తులు వెళ్తుంటారని అధికారుల అంచనా.  ప్రస్తుతం రోడ్డు మార్గంలోనే భక్తులు యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి దర్శనం కోసం వెళ్తుంటారు. 

Also Read: Jaya Bachchcan: తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలో పడేశారంటూ జయబచ్చన్‌ సంచలన వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో విపరీతమైన ట్రాఫిక్‌ కారణంగా గంట పాటు నగరం దాటేందుకే సమయం సరిపోతుంది. నగరం దాటిన తర్వాత మరో రెండు గంటలు ప్రయాణం. మొత్తంగా నగరం నుంచి యాదగిరిగుట్టకు నాలుగైదు గంటలు ప్రయాణానికే అయిపోతుంది.బస్సుల్లో, ప్రైవేట్‌ వెహికల్స్‌లో వెళ్లాలంటే అధిక మొత్తం ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే తీపి కబురు చెప్పింది. గంట సమయంలోనే రూ.20 టికెట్‌తో యాదగిరిగుట్ట చేరుకోవచ్చని తెలిపింది.

Also Read:  Trump: మెక్సికో, కెనడాకు బంపరాఫర్‌ ఇచ్చిన ట్రంప్‌ ..నెల రోజుల పాటు ఇక ఆ కష్టాలు ఉండవు!

ఘట్‌కేసర్‌-యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్‌ ట్రైన్ లైన్‌ డీపీఆర్‌ సిద్ధం చేశామని.. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ రైల్వే లైన్‌కు రూ.650 కోట్లు ఖర్చవుతాయని.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఎంఎంటీఎస్‌ రెండోదశకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రూ.491 కోట్లు బకాయి పడినట్లు తెలిపారు.

త్వరలో చర్లపల్లి నుంచి మరిన్ని ట్రైన్లు, ఎంఎంటీఎస్‌లు నడుపుతామని ప్రకటించారు. సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య ప్రస్తుతం 20, 16 కోచ్‌ల సామర్థ్యంతో వందేభారత్‌ ట్రైన్లు నడుస్తున్నాయని తెలిపారు. సికింద్రాబాద్‌-గుంటూరు మార్గంలో డబ్లింగ్‌ పనులు పూర్తయితే మరికొన్ని ట్రైన్లు నడిపే వెసులుబాటు కలుగుతుందని అన్నారు. రీజినల్‌ రింగ్‌ రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం డీపీఆర్‌ సిద్ధమవుతోందని.. కేంద్రం ఆమోదం పొందిన తర్వాత స్పష్టమైన ప్రకటన వస్తుందని చెప్పారు.

కాగా, యాదగిరిగుట్టకు MMTS ట్రైన్లు నడపాలని భక్తులు ఎప్పట్నుంచో సౌత్ సెంట్రల్ రైల్వేను డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎంఎంటీఎస్ రెండోదశ పనులు కొనసాగుతున్నాయి. MMTS ట్రైన్లు యాదగిరిగుట్ట సమీపంలోని రాయగిరి స్టేషన్‌ వరకు పొడగించాలని ఎనిమిదేళ్ల క్రితమే నిర్ణయించారు. ప్రస్తుతం మౌలాలి నుంచి ఘట్‌కేసర్‌ వరకు ఎంఎంటీఎస్ ట్రైన్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

అక్కడి నుంచి యాదగిరిగుట్టకు కొత్తగా మూడో లైను వేయాల్సి ఉంది. టెండర్ ప్రక్రియ ఆలస్యం కావటంతో ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. తాజాగా.. డీపీఆర్ సిద్ధమవుతోందని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం తెలిపారు. ఈ ట్రైన్ పట్టాలెక్కితే జస్ట్ రూ.20 ఛార్జీతో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు చేరుకోవచ్చు.

Also Read: America: అక్రమ వలసదారులతో భారత్‌ కు పయనమైన అమెరికా విమానం!

Also Read: Telangana: తెలంగాణ అఘోరీ అరెస్ట్.. కారుతో సహా గాల్లోకెత్తేసి.. అచ్చు అల్లు అర్జున్ జులాయి సినిమా సీన్‌ లాగానే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు