/rtv/media/media_files/2025/01/25/OyZK5HYUjws5F3jpCJYT.jpg)
Aghori in Karimnagar
Telangana: తెలంగాణ అఘోరీ పేరు తీస్తేనే.. చాలా మందికి కోపం, ఏహ్యమైన భావం కలుగుతోంది. అంతగా విరక్తి పుట్టేందుకు ఆమె చేసిన చేష్టలు..మాట్లాడే మాటలు,ఆమె ప్రవర్తనే కారణం. ఆమెను బట్టలేసుకొమ్మన్న తప్పే.. ఎవరైనా ఏమైనా అంటే కత్తులు తీసి హింసాకాండకు పాల్పడుతుంటుంది.
Also Read: AP Schools: ప్రైవేటు స్కూళ్లపై లోకేష్ సంచలన నిర్ణయం.. అధికారులతో కీలక భేటీ!
మొన్న కొమురవెల్లిలో, నిన్న సూర్యపేట జిల్లాలో కత్తులతో జనాలపై దాడులు చేయటం లాంటి చేష్టలన్ని ఆమెపై ఉండాల్సిన ఆధ్యాత్మిక భావనను తీసేసి కోపం తెప్పిస్తున్నాయి. అయితే.. ఎక్కడపడితే అక్కడ కారు ఆపేసి హల్‌చల్ చేస్తూ రోడ్లపై విన్యాసాలు చేసే అఘోరీ ఆట పోలీసులు కట్టించారు.
Also Read: Telangana: హైదరాబాద్‌లో ఏఐ యూనివర్సిటీ.. మంత్రి శ్రీధర్ బాబు సంచనలన ప్రకటన
పోలీసులు.. మొత్తానికి తమ ట్రీట్మెంట్ రుచి చూపించారు. కారుతో సహా గాల్లోకి ఎత్తేసి.. కిందికి దిగే వీలు లేకుండా చేసి కారును తరలించారు. ఈ సన్నివేశం అచ్చంగా అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమా సీన్‌ను తలపించింది. కాగా.. ఇదంతా .. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల చెక్‌పోస్ట్ వద్ద జరిగింది.
గత కొన్ని రోజులుగా వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో ఉన్న దర్గాను కూల్చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న అఘోరీ.. సోమవారం ఆ పని చేసేందుకు బయలుదేరింది. తన సోషల్ మీడియాల వేదికగా ఈ విషయాన్ని రెండు మూడు రోజులుగా అప్డేట్ ఇస్తుండగా.. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈక్రమంలోనే.. వేములవాడ వెళ్లే ఆయా మార్గాల్లో నిఘా పెట్టారు. దీంతో జిల్లెల్ల మీదుగా వెళ్తుందని తెలుసుకున్న పోలీసులు అడ్డుకుని.. వెనక్కి వెళ్లాలని చెప్పారు.
గాల్లోకి ఎత్తి...
పోలీసులు ఎంత చెప్పినప్పటికీ అఘోరీ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎంత చెప్పినా వినకపోవటంతో.. తమదైన ట్రీట్మెంట్ చూపించాల్సిందేనని పోలీసులు అనుకున్నారు. టోయింగ్ వెహికిల్ తీసుకొచ్చి.. ఆఘోరీతో సహా కారును గాల్లోకి ఎత్తి తరలించారు.
అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతూ నానా రచ్చ చేసిన అఘోరీ.. పోలీసుల చర్యలను మొబైల్‌లో వీడియో తీస్తూ మరింత సీన్ క్రియేట్ చేసింది. అయినా సరే.. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Delhi Elections: ఆప్ 55 స్థానాల్లో గెలుస్తుంది.. అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన