Trump: మెక్సికో, కెనడాకు బంపరాఫర్‌ ఇచ్చిన ట్రంప్‌ ..నెల రోజుల పాటు ఇక ఆ కష్టాలు ఉండవు!

అమెరికా సుంకాల విషయంలో మెక్సికో, కెనడాలకు తాత్కాలిక ఊరట లభించింది. సుంకాల విధింపును నెల రోజుల పాటు నిలిపివేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సుంకాల అంశంపై రెండు దేశాల మధ్య తదుపరి చర్చలు ఉంటాయని ట్రంప్ తెలిపారు.

New Update
Donald Trump

Donald Trump

America: అమెరికా పన్నుల విషయంలో మెక్సికో, కెనడాలకు తాత్కాలిక ఉపశమనంలభించింది. సుంకాల విధింపును నెల రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌తో స్నేహపూర్వక ఫోన్‌ కాల్‌ తర్వాత ఈ మేరకు అంగీకారానికి వచ్చినట్లు ట్రంప్ తెలిపారు. ఇదే విషయాన్ని తన సామాజిక మాధ్యమం ట్రూత్‌లో పోస్ట్ చేసి వివరించారు.

Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..మీదేనా మరి చూసుకోండి!

సుంకాల అంశంపై రెండు దేశాల మధ్య తరువాత చర్చలు ఉంటాయని ట్రంప్ తెలిపారు. ఫోన్‌కాల్ విషయాన్ని మెక్సికో అధ్యక్షురాలు షీన్‌బామ్‌ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మెక్సికో నుంచి అమెరికాకు డ్రగ్స్‌, ముఖ్యంగా ఫెంటానిల్‌ అక్రమ రవాణా, అక్రమ వలసదారుల చొరబాట్లను కట్టడి చేసేందుకు ఇప్పటికే 10 వేల మంది సైన్యాన్ని ఉత్తర సరిహద్దుకు తరలించనున్నట్లు షీన్‌బామ్‌ వివరించారు.అందుకోసం బోర్డర్ పాలసీలలో పలు మార్పులు చేసినట్టు వివరించారు.

Also Read: America: అక్రమ వలసదారులతో భారత్‌ కు పయనమైన అమెరికా విమానం!

అగ్రరాజ్యం సైతం మెక్సికోకు ఆయుధాల అక్రమ రవాణా నిరోధానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించిందన్నారు ట్రంప్. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా  ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సరిహద్దు భద్రతపై చర్యలు తీసుకుంటామని ఆయన ట్రంప్‌నకు హామీ ఇచ్చారు. మరోవైపు నేటి నుంచి సుంకాల విధింపు అమల్లోకి రానున్న నేపథ్యంలో చైనా దిగుమతులపై అమెరికా టారిఫ్‌ విధించే అవకాశాలు కనపడుతున్నాయి.

Also Read: Telangana: తెలంగాణ అఘోరీ అరెస్ట్.. కారుతో సహా గాల్లోకెత్తేసి.. అచ్చు అల్లు అర్జున్ జులాయి సినిమా సీన్‌ లాగానే!

Also Read: Children Stroke: విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలకు స్ట్రోక్ ప్రమాదం ఉందా?

Advertisment
తాజా కథనాలు