/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/flight-1-1-jpg.webp)
అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారుల ను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ సాగుతోంది. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి అధికారులు ఆ దేశాలకు ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు.
తాజాగా భారత్ కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన విమానం ఇండియాకు బయల్దేరింది. సీ17 ఎయిర్ క్రాఫ్ట్‌లో వీరిని తరలిస్తున్నట్లు సమాచారం. భారత్ కు చేరుకోవడానికి 24 గంటలు పడుతుందని అంచనా..అయితే ఎంత మంది అక్రమ వలసదారులను తరలిస్తున్నారనే విషయం పై సమాచారం లేదు.
అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే భారత్ తన స్పందనను తెలిపింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఈ అంశం అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది. వీసా గడువు ముగిసినా లేదా సరైన దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకు వచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
సరైన ధ్రువప్రతాలు లేకుండా...
అమెరికాలో సరైన ధ్రువప్రతాలు లేకుండా భారత్‌కు చెందిన వలసదారులు 7,25,000 మంది ఉన్నట్లు సమాచారం. మెక్సికో, సాల్వెడార్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది భారతీయులే.మెక్సికో,కెనడాల పై విధించదలుచుకున్న 25 శాతం సుంకాలను అమెరికా నెలరోజుల పాటు నిలిపివేయడానికి నిర్ణయించింది.
ఇరు దేశాల అధినేతలు అమెరికా సరిహద్దుల వెంట భద్రతను కట్టుదిట్టం చేస్తాయని హామీ ఇచ్చిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇరు దేశాలు 10,000 మంది భద్రతా బలగాలను తమ సరిహద్దులకు పంపించి మత్తుపదార్థాలు,మనుషుల అక్రమ రవాణాను అడ్డుకుంటామని పేర్కొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.
Also Read:AP Schools: ప్రైవేటు స్కూళ్లపై లోకేష్ సంచలన నిర్ణయం.. అధికారులతో కీలక భేటీ!
Also Read: Telangana: హైదరాబాద్‌లో ఏఐ యూనివర్సిటీ.. మంత్రి శ్రీధర్ బాబు సంచనలన ప్రకటన