Acquitted Rapist: అలా రేప్ చేస్తే తప్పుకాదు.. వీర్యం పట్టించిన కేసులో కోర్టు సంచలన తీర్పు!

యువతిపై లైంగిక దాడి కేసులో సిడ్నీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మద్యం మత్తులో రాత్రంతా వారిద్దరు ఒకే బెడ్‌పై పడుకోగా సెక్సోమ్నియా వ్యాధి కారణంగా రోలాండ్ ఇలా చేశాడని తెలిపింది. ఆమె ప్రైవేట్ పార్ట్‌లో వీర్యం అతనిదే కానీ ప్రమేయం లేకుండా చేస్తే నేరం కాదట.

New Update
australia

australia Photograph: (australia)

Acquitted Rapist: అమ్మాయిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఆస్ట్రేలియాలోని సిడ్నీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అత్యాచారానికి పాల్పడినట్లు రుజువు అయినప్పటికీ అతనిని నిర్దోషిగా వదిలేయడంతో ఈ టాపిక్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2022లో లైంగిక దాడి కేసు నమోదవగా సోమవారం ఈ కేసుపై తుది విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ప్రమేయం లేకుండా చేసిన నేరంలో అతన్ని దోషిగా నిర్ధారించలేమంటూ ప్రకటించడం గమనార్హం. కాగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

తెల్లారేసరికి నగ్నంగా.. 

ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన 40 ఏళ్ల 'తిమోతి మాల్కం రోలాండ్' అనే వ్యక్తి ఒక యువతితో కలిసి డార్లింగ్ హార్ట్స్‌ కాక్‌టెయిల్ బార్‌కు వెళ్లారు. అయితే ఇద్దరు అర్ధరాత్రి 1 గంట వరకు పీకలదాకా మద్యం తాగి తమ అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. మద్యం మత్తులోనే స్నానం చేసి ఒకే బెడ్ పై నిద్రించారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా ఉదయం అసలు కథ మొదలైంది. నిద్రలేచిన యువతి తాను నగ్నంగా ఉండటం చూసుకుని ఒక్కసారిగా కంగుతిన్నది. ప్రైవేట్ పార్ట్‌లో తడిగా ఉండటం చూసి ఉలిక్కిపడింది. నెమ్మదిగా రాత్రి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుని స్నేహితుడు రోలాండ్ తనపై లైంగిక దాడి చేసినట్లు నిర్ధారించుకుంది. 

యోనిలో వీర్యం అతనిదే.. 

ఒక్క క్షణం ఆసల్యం చేయకుండా అక్కడినుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌ వెళ్లి కంప్లైట్ ఇచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి రోలాండ్‌ను అరెస్ట్ చేశారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహించి యోనిలో ఉన్న వీర్యం పరీక్షించగా అది రోలాండ్ దేనని తేలింది. దీంతో ఆధారాలతో సహా ఈ కేసు కోర్టుకు చేరుకుంది. అయితే దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఆధారాలన్నీ పరిశీలించి రోలాండ్‌ దోషి అని తెలిపింది. 

ఇది కూడా చదవండి: Prabhas in kannappa: సోషల్ మీడియాలో ప్రభాస్ లుక్ పై ఫుల్ ట్రోల్స్

కోర్టు విచారణలో రోలాండ్ అత్యాచారం చేసినట్లు తనకు గుర్తులేదన్నాడు. చాలా కాలంగా తాను సెక్సోమ్నియా వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపాడు. రోలాండ్ వాదనలు విన్న కోర్టు అతనికి వైద్య పరీక్షలు చేయించగా నిజంగానే సెక్సోమ్నియా వ్యాది ఉన్నట్లు బయటపడింది. ఈ వ్యాధి ఉన్నవారు నిద్రలో నడుస్తారని, పక్కన పడుకున్న వారిని అత్యాచారం చేసే అవకాశం కూడా ఉంటుందని వైద్యులు కోర్టుకు స్పష్టం చేశారు. దీంతో రోలాండ్ ప్రమేయం లేకుండా చేసిన నేరానికి దోషిగా నిర్ధారించలేమని కేసును కొట్టివేసింది. ఈ తీర్పుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేయగా రోలాండ్ లైంగిక దాడికి పాల్పడినప్పుడు నిద్రలో లేడని నిరూపిస్తే అతనికి కఠిన శిక్ష వేస్తామని ప్రకటించింది న్యాయస్థానం. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు