వర్షిణి మళ్లీ పెళ్లి.. | Varshini Marriage | Lady Aghori And Sri Varshini Latest Updates | RTV
మహిళ ప్రొడ్యూసర్‌ను బెదిరించిన కేసులో అఘోరికి చేవెళ్ల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.5వేల చొప్పున రెండు పూచీకతులు సమర్పించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అఘోరిపై మరోరెండు పెండింగ్ కేసులు ఉన్నాయి. ఈ రెండు కేసులో అఘోరీ మళ్లీ జైలుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
లేడీ అఘోరిపై మరో రేప్ కేసు నమోదైంది. కరీంనగర్ కొత్తపెళ్లికి చెందిన యువతి బలవంతంగా తన ప్రైవేట్ పార్ట్స్‌ను తాకుతూ లైంగి దాడికి పాల్పడ్డట్లు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అఘోరిని విచారించనున్నారు.
మోకిలా పీఎస్‌లో అఘోరీ కస్టడీ ముగియడంతో పోలీసులు ఇవాళ అఘోరీ అలియాస్ శ్రీనివాస్‌ను షాద్‌నగర్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన కోర్టు.. అఘోరీకి మరో 14 రోజులు రిమాండ్ పొడిగించింది. మళ్లీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకి తరలించారు.
లేడీ అఘోరీ ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉంది. త్వరలో ఆమెను ఓ బిగ్ పొలిటీషియన్ ములాఖత్‌లో కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఒక లాయర్‌తో మాట్లాడి అఘోరీకి బెయిల్ తెచ్చే పనిలో ఉన్నాడని సమాచారం.
చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.