Telangana: హైదరాబాద్‌లో ఏఐ యూనివర్సిటీ.. మంత్రి శ్రీధర్ బాబు సంచనలన ప్రకటన

హైదరాబాద్‌లో నిర్మించనున్న ఏఐ సిటీలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. 200 ఎకరాల్లో ఈ ఏఐ సిటీని నిర్మిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఏఐ అంటేనే తెలంగాణ, హైదరాబాద్ గుర్తుకు వచ్చేలా చేస్తామన్నారు.

New Update
Minister Sridhar Babu

Minister Sridhar Babu

ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌ బాబు కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో నిర్మించనున్న ఏఐ సిటీలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 200 ఎకరాల్లో ఈ ఏఐ సిటీని నిర్మిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏఐ అంటేనే తెలంగాణ, హైదరాబాద్ గుర్తుకు వచ్చేలా మారుస్తామని అన్నారు. అలాగే వర్సిటీ నిర్వహణలో సంబంధిత పరిశ్రమలు, నిపుణులను కూడా భాగస్వామ్యం చేస్తామన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీస్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికులను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు.  

Also Read: ఛీ ఛీ వీడేం వార్డెన్‌రా బాబూ.. అబ్బాయిలను రూమ్‌కు తీసుకెళ్లి బట్టలిప్పి!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సేవలందిస్తున్న డిపాజిటరీ ట్రస్ట్, క్లియరింగ్ కార్పొరేషన్ కొత్త కార్యాలయాన్ని శ్రీధర్‌ బాబు ప్రారంభించారు. అయితే ఇక్కడ దాదాపు 500 మందికి కొత్తగా ఉద్యోగవకాశాలు రానున్నాయని పేర్కొన్నారు. అలాగే రాబోయే రోజుల్లో 2 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. వీటిలో ఎక్కువగా తెలంగాణ యువతకే ఉద్యోగాలు ఇచ్చేందుకు యాజమాన్యం కూడా అంగీకరించినట్లు పేర్కొన్నారు.   

Also Read: వీళ్లేం ఆడోళ్లురా బాబు.. బస్సు సీటు కోసం జుట్లు పట్టుకొని రప్పా రప్పా: వీడియో వైరల్!

'' యువత వినూత్నంగా ఆలోచించాలి. కొత్త ఆవిష్కరణలపై ఫోకస్ పెట్టాలి. ఇలాంటి కృషి చేసేవాళ్లకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. హైదరబాద్‌లో 100 నుంచి 120 కంపెనీల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సేవలందిస్తున్నాయి. అన్ని రకాల పరిశ్రమలు పెట్టేందుకు తెలంగాణలో అనువైన వాతావరణం ఉంది. ఇండస్ట్రీలకు కావాల్సిన మానవ వనరులను మేమే అందిస్తామని'' శ్రీధర్ బాబు అన్నారు.  

Also Read: అక్రమార్కులపై హైడ్రా ఉక్కుపాదం.. అక్కడ భారీ కూల్చివేతలు!

Also Read: కేసీఆర్ కు బిగ్ షాక్... లీగల్ నోటీసులు పంపిన లాయర్ ఎందుకో తెలుసా....

Advertisment
తాజా కథనాలు