/rtv/media/media_files/2025/02/03/nieaoIQSpvJ71XDubiBB.jpg)
Arvind Kejriwal
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీకి 55 సీట్లు వస్తాయని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. ప్రజలు గట్టిగా అనుకుంటే 60కి పైగా సీట్లు వస్తాయని పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన చివరి ఎన్నికల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీ, జంగ్‌పురా, కల్కాజీలో ఆప్ గెలవదని బీజేపీ చెబుతోందని.. కానీ ఆ స్థానాల్లో ఆప్ చారిత్రాత్మక మెజార్టీతో గెలవనుందని అన్నారు.
ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తాజాగా అరవింద్ కేజ్రీవాల్.. ఓ వీడియోను కూడా విడుదల చేశారు. బీజేపీ గుండాల అకృత్యాలు, ఎన్నికల అక్రమాలను రికార్డ్ చేసేందుకు తమ పార్టీ స్లమ్ ఏరియాల్లో స్పై కెమెరాలు పంపిణీ చేసినట్లు వీడియోలో చెప్పారు. ఆప్ చారిత్రక విజయం సాధిస్తుందని.. బీజేపీ ఎన్నడూ లేనంత ఘోరమైన పరాజయాన్ని ఎదుర్కోనుందని కేజ్రీవాల్ అన్నారు. స్లమ్ ఏరియాల్లో ఉంటున్నవారికి 3 వేల నుంచి 5 వేల వరకు ఆశచూపి వాళ్లు ఓటు వేయకుండా చేతి వేళ్లకు సిరా వేయాలని బీజేపీ ప్లాన్ వేసినట్లు ఆరోపించారు.
Also Read: ఢిల్లీలో ముగిసిన ఎన్నికల ప్రచారం..
డబ్బులిస్తే తీసుకోవాలని.. కానీ సిరా వేసుకోవద్దని కేజ్రీవాల్ స్లమ్ ఏరియా ప్రాంత వాసులకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే మురికి వాడలను కూల్చివేస్తుందని హెచ్చరించారు. మీ ఓటును అమ్ముకుంటే మరణ వారెంట్‌పై మీరే సంతకం చేసుకున్నట్లు అవుతుందని పేర్కొన్నారు. అలాగే బీజేపీ చేయబోయే అక్రమాలకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ బృందాలు రాజ్యాంగ విరుద్ధ కార్యక్రలను అరికట్టేందుకు.. దోషులను అరెస్టు చేసేందుకు 15 నిమిషాల్లోనే ఘటనాస్థలానికి చేరుకుంటాయని తెలిపారు. అయితే కేజ్రీవాల్ చేసిన ఈ ఆరోపణలపై బీజేపీ ఇంతవరకు స్పందించలేదు.
मेरे अनुमान के मुताबिक आम आदमी पार्टी की 55 सीट आ रही हैं लेकिन अगर महिलाएं ज़ोर लगा दें - सभी वोट करने जायें और अपने घर के पुरुषों को भी आम आदमी पार्टी को वोट देने के लिए समझायें - तो 60 से ज़्यादा भी आ सकती हैं।
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 3, 2025
आम आदमी पार्टी पूरी सतर्कता से ये चुनाव लड़ेगी। https://t.co/znN45u0MuS
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 3, 2025
Also Read: ఎన్నికల కమిషనర్‌కు బీజేపీ ఆఫర్.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
ఇదిలాఉండా స్థానిక సంస్థలు తమ ప్రీపోల్ సర్వేలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని తేల్చి చెప్పాయి. కానీ 2015, 2020 ఎన్నికల కంటే ఈసారి ఆప్‌నకు సీట్లు తగ్గనున్నట్లు తమ సర్వేలో వెల్లడించాయి. ఆప్‌కు 38- 40 సీట్లు, బీజేపీకి 31-33, కాంగ్రెస్ 0 సీట్లు వస్తాయని ఫలోడి సత్తా బజార్ అనే సంస్థ అంచనా వేసింది. ఇక వీప్రిసైడ్ అనే మరో సంస్థ కూడా ఆప్‌కు 50-55, బీజేపీకి 15-20, కాంగ్రెస్‌కు 0 సీట్లు వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఈ సర్వేలు చెప్పడం గమనార్హం. అయితే మరీ ఈసారి ఢిల్లీ ప్రజలు ఏ పార్టీకి అధికార పగ్గాలు అప్పగిస్తారో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Addressing the Media | LIVE https://t.co/OpufD4b0iV
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 3, 2025
Follow Us