/rtv/media/media_files/2026/01/09/fotojet-17-2026-01-09-21-43-59.jpg)
Sankranti beauty for the city..a town with a rural feel
Sankranti : అప్పుడే నగరానికి సంక్రాంతి శోభ(Sankranti Rush) వచ్చింది. రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు(Sankranti Holidays 2026) ప్రకటించడంతో జనం పల్లెబాట పట్టారు. ఈ రోజు నగరవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. రేపటి నుంచి సెలవులు ప్రకటించడంతో ఈ సాయంత్రమే పలువురు ఊరికి పయనమయ్యారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిపోతున్నాయి. శనివారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడం, ఆఫీసులకు వీకెండ్ కావడంతో ఈ రోజే స్వగ్రామాలకు వెళ్లేందుకు హైదరాబాద్ నగర వాసులు ఒక్కసారిగా బస్టాండ్లకు చేరుకున్నారు.దీంతో రోడ్లన్ని కిక్కిరిసిపోయాయి.
వీకెండ్, స్కూళ్లకు సెలవులు కలిసి రావడంతో పట్టణాల నుంచి సొంతూళ్లకు బయలుదేరిన ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కళకళలాడుతున్నాయి. మరోవైపు సొంత వాహనాల్లోనూ ప్రజలు స్వగ్రామాలకు బయలుదేరడంతో ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండి పోయాయి. దీంతో రోడ్లన్నీ జనసముద్రంగా మారిపోయాయి.
హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ పల్లెలు, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు జనం ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో వెళ్లే రోడ్లన్నీ నిండిపోయాయి. హైదరాబాద్- విజయవాడ 65వ జాతీయ రహదారి పూర్తిగా రద్దీగా మారింది. పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. దీంతో స్వగ్రామాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యగా మారింది. రద్దీ సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు చేయాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. - Secundrabad Railway Station
Also Read : జీవించి ఉన్న మేక నుంచి రక్తం సేకరణ.. అనుమానంతో ఎంక్వైరీ చేస్తే..
ఊరెళ్తే.. సమాచారమివ్వండి
కాగా, సంక్రాంతి పండుగ(Pongal 2026) కు ఊరెళ్లే వారు కచ్చితంగా సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని పోలీస్ అధికారులు కోరారు. ఇంటిలో ఎవరూ లేని సమయాల్లో దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కాబట్టి పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.సంక్రాంతి సెలవులకు ఊరు వెళ్తున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఇంట్లో విలువైన వస్తువులు, ఆభరణాలు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.
సీసీ కెమెరాలకు విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలన్నారు. ఎవరైతే ఉరికి వెళ్తున్నారో చుట్టు పక్కల వారికి చెప్పాలని, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో కూడా సమాచారం ఇవ్వాలన్నారు. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పెట్రోలింగ్ చేస్తామని తెలిపారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపామని తెలిపారు. ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్‌తో పాటు అలారం కూడా ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు కోరుతున్నారు.
Also Read : గాలిపటాలు సంక్రాంతికే ఎందుకు ఎగరేస్తారంటే?
Follow Us