Sankranti 2026: గాలిపటాలు సంక్రాంతికే ఎందుకు ఎగరేస్తారంటే?

సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చేది రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, పిండి వంటలు. కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేసి వాటి చుట్టూ ఆడటం ఇదంతా ఒక ఎత్తు. అయితే సంక్రాంతి అనగానే మనకు అమితంగా ఇష్టమైన గాలిపటాలు ఎగరవేయడం ఆనవాయితీ.

New Update
FotoJet (10)

Why are kites flown only on Sankranti?

Sankranti : సంక్రాంతి(Pongal 2026) అంటే గుర్తుకు వచ్చేది రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, పిండి వంటలు. కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేసి వాటి చుట్టూ ఆడటం ఇదంతా ఒక ఎత్తు. అయితే సంక్రాంతి అనగానే మనకు అమితంగా ఇష్టమైన గాలిపటాలు(kite-festival) ఎగరవేయడం ఆనవాయితీ. చిన్నా పెద్దా తేడా లేకుండా ఆ రోజు  కైట్స్ ను ఎగురవేస్తారు. 

అయితే గాలిపటాలు ఎగరవేయడం అన్ని రాష్ట్రాల్లో లేకపోయినప్పటికీ హైదరాబాద్ తో పాటు గుజరాత్, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల్లో సంక్రాంతికి  ప్రజలంతా గాలి పటాలను ఎగురవేస్తారు. కొన్ని రాష్ట్రాల్లోనైతే పతంగుల పోటీలు కూడా నిర్వహిస్తారు. అయితే  గాలిపటాలు ఎగరవేయడం వెనుక కొన్ని నమ్మకాలు, మరికొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. పురాణాల ప్రకారం రాముడు మకర సంక్రాంతి రోజున  గాలి పటాన్ని ఎగురవేశాడని చెబుతారు. రాముడు ఎగరేసిన గాలిపటం కాస్త ఇంద్రలోకానికి చేరిందట. ఇక అప్పటి నుంచి ప్రతి ఏడాది సంక్రాంతికి పతంగులు ఎగురవేయడం అనవాయితీ అయిందంటారు.

Also Read :  వివాదాలు వద్దు..పరిష్కారం కావాలి..సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Why Are Kites Flown Only On Sankranti?

ఇదేకాదు, సంక్రాంతి(sankranthi) కి పతంగులు ఎగురవేయడం వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. సంక్రాంతికి విపరీతమైన చలి  ఉంటుంది. ఈ సమయంలో పొద్దున్నే పతంగులు ఎగురవేయడం వల్ల సూర్య కిరణాలు శరీరాన్ని తాకుతాయి. వీటి వల్ల వ్యాధులు దరి చేరవు. చలి కాలంలో జలుబు, దగ్గు వంటివి వస్తుంటాయి. కాబట్టి  సంక్రాంతి వేళ పొద్దున, సాయంత్రం గాలిపటాలను ఎగురవేసేటప్పుడు సూర్య కిరణాలు శరీరానికి మంచి ఔషధంగా పని చేస్తాయని చెబుతున్నారు.

ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే తొలి పండగ సంక్రాంతి. దసరా లాగే తెలుగువారికి ముఖ్యమైన పండగ. ఈ సమయంలోనే గ్రామాల్లో రైతులు పండించిన కొత్త ధాన్యం ఇంటికొస్తుంది. ఈ సందర్భంగా తమకు సాగులో సాయపడిన ఆవులు, ఎడ్లను లక్ష్మిదేవితో సమానంగా పూజిస్తారు అన్నదాతలు. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండగకు ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉంటుంది. భోగి రోజున సూర్యోదయానికి ముందే భోగిమంటలు, ఇంటి ముందు ముగ్గులు, పిల్లలకు భోగిపళ్లు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, కోడిపందేలు  ఇలా ఎన్నో  ఉంటాయి. అలాంటి వాటిలో గాలిపటాలు ఎగరవేయడం కూడా ఒకటి.

జనవరిమాసంలో సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఇది వసంత ఆగమనాన్ని సూచిస్తుంది. అందుకే ఈ పండగను శ్రేష్ఠమైనదిగా భావిస్తారు తెలుగువారు. భోగి, మకర సంక్రాంతి, కనుమగా విభజించి మూడు రోజులూ ప్రత్యేక వేడుకలు జరుపుకుంటారు. వీటిలో మకర సంక్రాంతిని ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి అంకితం చేస్తూ ఆయా సంప్రదాయాలు పాటిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగరేస్తుంటారు. ఇలా చేయడానికి కారణమేంటంటే.. సాధారణంగా చలికాలంలో క్రిములు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండటం వల్ల ఎండ పొడ తగలక జలుబు, జ్వరం వస్తుంటాయి. లేలేత సూర్యకిరణాలు శరీరాన్ని తాకితే డి- విటమిన్ ఉత్పత్తి అయ్యి సహజంగానే బ్యాక్టీరియా నశిస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.  

అంతేగాక, మకర సంక్రాంతి రోజున సూర్యకాంతిని నేరుగా పొందటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ రోజున శరీరం మీద సూర్య కిరణాలు పడే కిరణాలకు వివిధ వ్యాధులను నయం చేసే శక్తి ఉందని విశ్వసిస్తారు. అందుకే పతంగులు ఎగరేయాలని ఆచారం మొదలైందని అంటారు. మరో కథ కూడా ప్రచారంలో ఉంది. మకర సంక్రాంతి, ఉత్తరాయణ సమయంలో గాలిపటాలు ఎగరేస్తే స్వర్గానికి వెళ్తారని నమ్ముతారు. మంచి జీవితాన్ని, సంతోషాన్ని ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపేందుకు గాలిపటం ఎగురవేస్తారట. మొత్తం మీద గాలిపటం ఎందుకు ఎగరవేసిన మనిషి ఆనందంగా ఉండడానికి అదోక సందర్భమని చెప్పుకోవచ్చు.

Also Read :  మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న కేసీఆర్.. పేద విద్యార్థులకు సాయం

Advertisment
తాజా కథనాలు