/rtv/media/media_files/2025/06/26/revenue-officials-shock-sons-2025-06-26-17-37-52.jpg)
Revenue officials shock sons
నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిదండ్రులను నేటితరం నిర్లక్ష్యం చేయడం సర్వసాధారణమైంది. వయసు సహరించినంత కాలం కొడుకులకు సేవ చేసిన తల్లిని జీవిత శరమాంకంలో సేవ చేసేందుకు కొడుకులు ఇష్టపడడం లేదు. తన పనులు తాను చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధులను ఇంటినుంచి బయటకు గెంటివేస్తున్నారు. అలాంటి కొడుకులకు రెవెన్యూ అధికారులు గట్టి గుణపాఠం చెప్పిన ఘటన హైదరాబాద్ మూసారాంబాగ్ లో చోటు చేసుకుంది.
ఇది కూడా చూడండి: Sexual Harassment : ప్లీజ్ వీడియో కాల్ లో మాట్లాడు.. ఓ చీఫ్ ఇంజినీర్ ఛీప్ ప్రవర్తన..సీతక్క ఫైర్
Revenue Officials Shock
వివరాల ప్రకారం..ముసారాం బాగ్‌కు చెందిన శకుంతలాబాయికి ఇద్దరు కొడుకులు, నలుగురు బిడ్డలు. ఆమె తన జీవితమంతా త్యాగం చేసి వారిని పెంచి పోషించి అందరికీ పెళ్లిళ్లు చేసింది. ఆమె భర్త చాలా సంవత్సరాల క్రితమే మరణించాడు. కాగా ఇప్పుడు ఆమె వయసు 90 సంవత్సరాలు. కొంతకాలంగా కొడుకుల వద్దే ఉంటున్న ఆమె ఆలనా పాలనా చూసుకోవడానికి కొడుకులు నిరాకరించారు. అంతేకాక ఆమెను బలవంతంగా బయటకువెళ్లగొట్టారు. దీంతో కన్నీళ్లతో సైదాబాద్‌లో ఉంటున్న చిన్నబిడ్డ వద్ద ఉంటోంది.
ఇది కూడా చూడండి: Chhattisgarh : మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. నలుగురు కీలక నేతల అరెస్ట్
అయితే ముదిమి వయసులో తల్లిని పట్టించుకోని కొడుకులు తన ఇంట్లో ఉండవద్దని, తన ఇల్లు తనకు ఇచ్చేలా చూడాలని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ద్వారా శకుంతలాబాయి హైదరాబాద్ జిల్లా రెవెన్యూ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె చేసిన ఫిర్యాదు మేరకు ఇద్దరు కొడుకులను పిలిచి ఆర్డీవో కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. కాగా వృద్దురాలి ఇంటిని ఆమెకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. దానికి వారు అంగీకరించారు. కానీ, నెలలు గడుస్తున్నా ఇంటిని ఖాళీ చేయకపోగా తల్లిని పట్టించుకోవడం మానేశారు.
దీంతో శకుంతలాబాయి మరోసారి ఫిర్యాదు చేసింది. ఈ విషయమై స్పందించిన సైదాబాద్ తహశీల్దార్ జయశ్రీ మూడు రోజుల క్రితం బాధితురాలి కొడుకులకు ఫైనల్ నోటీస్ జారీ చేశారు. రెండ్రోజుల్లో ఇల్లు ఖాళీ చేయక పోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. అయినా వారు ఇళ్లు ఖాళీ చేయలేదు. వారికి ఇచ్చిన గడువు ముగియడంతో స్వయంగా తహశీల్దార్ ఆ ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కొడుకులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. అక్కడికి చేరుకున్న రెవెన్యూ సిబ్బంది ఆ ఇంటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కొడుకులు వచ్చాక పంచనామా చేసి శకుంతలాబాయికి అప్పగిస్తామని తహశీల్దార్ జయశ్రీ స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి: Surveyor Tejeshwar Murder: పోలీసుల అదుపులో బ్యాంక్ మేనేజర్.. వెలుగులోకి సంచలన విషయాలు
ఇది కూడా చూడండి: Black Magic: ఏపీలో వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోకు క్షుద్ర పూజలు - ఇలా తయారయ్యారేంట్రా
telugu-news | telangana-news | revenue-divisional-officers | revenue officer | revenue-department | sons | old women
Follow Us