/rtv/media/media_files/2025/06/25/anantapur-black-magic-with-whatsapp-profile-photo-2025-06-25-13-37-40.jpg)
anantapur black magic with WhatsApp profile photo
ఏపీలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలోని మడకశిర పట్టణం శివపురం సమీపంలో ఉన్న రోడ్లపై ఓ మహిళ వాట్సప్ ప్రొఫైల్ ఫోటోకు క్షుద్ర పూజలు చేయడం స్థానికంగా సంచలనం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఓ మహిళ ఫోటోకి మేకులు కొట్టి, నిమ్మకాయలు, కోడిగుడ్లతో పూజలు చేయడం సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోకు క్షుద్ర పూజలు
భారతి అనే మహిళ బతుకు తెరువు కోసం కిరాణా కొట్టు నడుపుతుంది. అయితే గుర్తు తెలియని దుండగులు కిరాణా కొట్టు ఎదురుగా ఉన్న ఆమె వాట్సప్ ప్రొఫైల్లో ఉన్న ఫోటో తీసుకొని భయంకరంగా క్షుద్ర పూజలు నిర్వహించారు. మడకశిర పట్టణం శివపురం సమీపంలో ఉన్న రోడ్డుపై అతి భయంకరంగా క్షుద్ర పూజలు చేశారు.
రోడ్డుపై ఆమె ఫోటోను పెట్టి వాటికి నాలుగు మేకులు కొట్టి, నాలుగు నిమ్మకాయలు, కోడిగుడ్లు పెట్టి ఇలా భయంకరమైన పద్ధతిలో పూజలు చేయడం గ్రామంలో సంచలనంగా మారింది. బుధవారం ఉదయం రోడ్డుపై క్షుద్ర పూజలను చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో విషయం తెలుసుకున్న భారతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా క్షుద్ర పూజలు జరిపించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.
Also Read: కాల్పుల విరమణకు బ్రేక్.. ఇజ్రాయెల్‌పై మళ్లీ ఇరాన్ దాడులు