Sexual Harassment : ప్లీజ్ వీడియో కాల్ లో మాట్లాడు.. ఓ చీఫ్ ఇంజినీర్ ఛీప్ ప్రవర్తన..సీతక్క ఫైర్‌

తెలంగాణ మహిళా ఉద్యోగులకు ఓ చేదు అనుభవం ఎదురైంది. పంచాయతీ రాజ్‌ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఓ చీఫ్‌ ఇంజినీర్‌ నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. పంచాయతీరాజ్‌ శాఖలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై మహిళా అధికారులు మంత్రి సీతక్కకు ఫిర్యాదు చేశారు.

New Update
Chief Engineer's bad behavior.. Seethakka fire

Chief Engineer's bad behavior.. Seethakka fire

Sexual Harassment : తెలంగాణ లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఓ చేదు అనుభవం ఎదురైంది. పంచాయతీ రాజ్‌ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఓ చీఫ్‌ ఇంజినీర్‌ నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. పంచాయతీరాజ్‌ శాఖలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై మహిళా అధికారులు మంత్రి సీతక్కకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

ఇది కూడా చూడండి: Black Magic: ఏపీలో వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోకు క్షుద్ర పూజలు - ఇలా తయారయ్యారేంట్రా

పంచాయతీ రాజ్ శాఖలోని  క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పని చేస్తున్న ఓ చీఫ్ ఇంజినీర్ తమను వేధిస్తున్నాడంటూ సదరు అధికారిపై తాజాగా మహిళా అధికారులు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో  పాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్‌కు ఫిర్యాదు చేశారు. సదరు చీఫ్‌ ఇంజినీరు మహిళా ఉద్యోగులను వేధించడంతో పాటు పగలు, రాత్రి వీడియోకాల్స్‌ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నాడని వారు వాపోతున్నారు. అంతేకాక వీడియో కాల్‌లో అందుబాటులో లేని వారికి కాల్స్‌ చేసి ఫ్లీజ్‌ వీడియో కాల్‌ లో మాట్లాడు అంటూ వేధిస్తున్నాడని వారు ఆరోపించారు. 

Also Read: వందేభారత్‌ రైలులో దారుణం..సీటు మారలేదని ప్రయాణికుడిని చితకబాదిన ఎమ్మెల్యే

ఆ ఇంజినీరు వేధింపులతో తాళలేకపోతున్నామని, ఆయన కాల్స్‌తో ఫోన్‌కాల్స్‌ ఎత్తాలంటేనే భయం వేస్తుందని వారు సీతక్కకు వివరించినట్లు తెలిసింది. ఆయన మీద చర్యలు తీసుకోవాలని వారు మంత్రితో మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై సీరియస్‌ అయిన మంత్రి సీతక్క సంఘటనపై విచారణ జరిపించాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సృజనకు ఆదేశాలు జారీ చేశారు. విచారణలో ఆ ఉద్యోగి మీద ఆరోపణలు నిజమని తేలితే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది.

Also Read: ఈపీఎఫ్‌ఓ చందాదారులకు అదిరిపోయే న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు!

Advertisment
Advertisment
తాజా కథనాలు