CM Revanth: ఫ్యూచర్‌ సిటీ వరకు మెట్రో విస్తరణ: సీఎం రేవంత్

తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ఫ్యూచర్‌ సిటీ నిర్మించేందుకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడి వరకు మెట్రో సేవలు విస్తరించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. దీనికోసం అవసరమైన ప్రతిపాదనలు రెడీ చేయాలని కోరారు.

New Update
CM Revanth

CM Revanth

తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ఫ్యూచర్‌ సిటీ నిర్మించేందుకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడి వరకు మెట్రో సేవలు విస్తరించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. దీనికోసం అవసరమైన ప్రతిపాదనలు రెడీ చేయాలని కోరారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు.  

Also Read: బైక్‌పై హిందూ యువకుడు, ముస్లిం యువతి.. నలుగురు యువకులు ఏం చేశారంటే ?

Hyderabad Metro Extend - CM Revanth Reddy

 మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర నుంచి అనుమతులు రావాల్సి ఉందని.. ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఫ్యూచర్‌ సిటీలోని యంగ్‌ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల వరకు మెట్రో విస్తరించేందుకు ప్రణాళిక రెడీ చేయాలని ఆదేశించారు.   

Also Read: కసబ్‌ కోసం రూ.28 కోట్లు ఖర్చు.. తహవూర్‌ రాణా కోసం ఎంత ఖర్చు చేయాలో ?
   
30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి జరుగుతుందని.. భవిష్యత్తు నగర విస్తరణ దృష్ట్యా మెట్రోను మీర్‌ఖాన్‌పేట్‌ వరకు పొడిగించాలని సీఎం చెప్పారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్రానికి పంపించాలన్నారు. HMDA, FSDA సంయుక్తంగా ఈ మెట్రో రూట్‌ విస్తరణ బాధ్యత తీసుకోవాలని తెలిపారు.  ఇదిలాఉండగా హైదరాబాద్‌ మెట్రో రెండో దశలో భాగంగా 76.4 కి.మీ విస్తరణ కోసం రూ.24,269 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం పంపించింది. 

Also Read: బైక్‌పై హిందూ యువకుడు, ముస్లిం యువతి.. నలుగురు యువకులు ఏం చేశారంటే ?

Also Read :  టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. టెట్ నోటిఫికేషన్ విడుదల!

 telugu-news | rtv-news | cm revanth | metro

 

revanth-reddy | extend hyderabad metro | hyderabad metro expansion | hyderabad-metro | latest telangana news | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు