TG TET: టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. టెట్ నోటిఫికేషన్ విడుదల!

టీచర్ అభ్యర్థులకు అలర్ట్. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం https://tgtet2024.aptonline.in/tgtet/ అధికారిక వెబ్ సైట్.

New Update
TS: టీచర్లకు తెలంగాణ సర్కార్ షాక్..  ఆ డిమాండ్ కు నో!

TG TET: టీచర్ అభ్యర్థులకు అలర్ట్. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం https://tgtet2024.aptonline.in/tgtet/ అధికారిక వెబ్ సైట్ సందర్శించాలని సూచించింది. అయితే నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం మాత్రం ఏప్రిల్‌ 15 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది.

Also Read :  ఇళ్లు కోసం బిడ్డను చంపిన సవతి తల్లి.. హైదరాబాద్‌లో హతమార్చి నల్గొండలో పాతిపెట్టి!

మరో 6 వేల పోస్టులు భర్తీ..

తెలంగాణలో వరుసగా టెట్‌, డీఎస్సీ నోటిఫికేషన్లు వస్తున్నాయి. గతేడాది టెట్, డీఎస్సీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా మరో టెట్, డీఎస్సీని నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2024లో 11 వేల పోస్టులతో డీఎస్సీ నిర్వహించగా ఈసారి మరో 6 వేల పోస్టులు భర్తీ చేయనుంది. ఇందులో భాగంగానే తాజాగా టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను విద్యాశాఖ గుర్తించింది. మొత్తంగా 6 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.

Also Read: ఐఐటీ బాబాను బహిష్కరించిన సొంత అఖాడా.. అసలు కారణం ఏంటంటే!

ఈ ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందు పలు అంశాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. రాష్ట్రంలో టీచర్ల రేషనలైజేషన్ విధానం జరుగుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్లపై ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత ఎస్సీ కోటా ఏ మేరకు కేటాయించాలని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ సర్కార్ రెండుసార్లు టెట్‌, ఒకసారి డీఎస్సీ పరీక్ష నిర్వహించింది. విద్యాశాఖలో ఎలాంటి ఖాళీలు లేకుండా ప్రణాళికలు రచిస్తున్నారు. 



 tg-tet-notification | 2025 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు