/rtv/media/media_files/2025/04/11/cWz9pO6CL5GzBPebSL52.jpg)
Kasab and Tahawwur Rana
2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి దేశ చరిత్రలో ఒక కిరాతక ఘటనగా నిలిచిపోయింది. ఇది జరిగి 16 ఏళ్లు గడిచిపోయాయి. ఈ మరణహోమం వెనకున్న ఉగ్రవాదుల్లో ఒకరైన తహవ్వుర్ రాణాను ఇండియాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులో ఉన్నాడు. అయితే ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు రాణాను 18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది.
2008 నవంబర్ 26న తాజ్ హోటల్‌లో ఉగ్రవాది అజ్మల్ కసబ్‌తో పాటు ఇతర ఉగ్రవాదులు కలిసి ఈ మరణహోమం సృష్టించారు. ఈ దాడిలో ప్రాణాలతో బయటపడ్డ ఏకైక నిందితుడు కసబ్‌ను ఉరి తీసేందుకు చాలా కాలం పట్టింది. 2012లో నవంబర్ 21న ఉదయం 7.30 గంటలకు కసబ్‌ను ఉరితీశారు. అయితే అతడికి జైల్లో ఉన్నప్పుడు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో తహవూర్ హుస్సేన్ రాణాకు ఇలాంటి వీఐపీ ట్రీట్‌మెంట్ ఇవ్వొద్దని ముంబై ఉగ్రదాడి బాధితులతో పాటు చాలామంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ఇదొక విచిత్రమైన లవ్ స్టోరీ.. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చి పాపను పడేశాడు!
కసబ్‌ను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి ఉరిశిక్ష విధించే వరకు అతడిపై ఎంత ఖర్చు పెట్టారనే వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా అథక్ సేవా అథక్ సేవా సంఘ్ ఛైర్మన్ అనిల్ గాల్గాలీ వివరాలు సేకరించారు. ఇందులో కసబ్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి మొత్తం రూ.28.46 కోట్లు ఖర్చు చేసినట్లు తేలింది. పుణెలోని యరవాడ జైలులో కసబ్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేశాయి.
మహారాష్ట్ర ప్రభుత్వం కసబ్‌పై పెట్టిన ఖర్చు వివరాలను విడుదల చేసింది. ఆహారం కోసం రూ. 43,417.67, భద్రత:- రూ. 1,50,57,774.90, మెడిసిన్: రూ. 32,097, దుస్తులు: రూ. 2,047, సెక్యూరిటీ: రూ. 5,25,16,542, అంత్యక్రియలు: రూ. 9,573, దుస్తులు: రూ. 2,047, సెక్యూరిటీ: రూ. 5,25,16,542, అంత్యక్రియలు: రూ. 9,573.. మొత్తం ఖర్చు రూ. 6,76,49,676.82.
అయితే ఇప్పుడు ఎన్‌ఐఏ రిమాండ్‌లో తహవ్వుర్ రాణాకు కూడా ఎక్కువ కాలం విచారణ కొనసాగితే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఖర్చులతో పోలిస్తే కసబ్‌కు పెట్టిన దానికన్న రాణాకు ఇంకా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే అతడికి ఇలాంటి వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చి మేపాల్సిన అవసరం లేదని.. వెంటనే ఉరితీయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read: స్కూల్ బ్యాగ్‌లో కండోమ్స్, తంబాకు ప్యాకెట్లు, కత్తులు, అగ్గిపెట్టలు.. ఎవర్రా మీరంతా!
ప్రస్తుతం, ఎన్‌ఐఏ రిమాండ్‌లో ఉన్న తహవూర్ రాణాకు సైతం విచారణ సుదీర్ఘ కాలం జరిగితే భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. నాటి కసబ్ పెట్టిన ఖర్చుతో పోలిస్తే తహవూర్ రాణాకు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే అతడికి ఇలాంటి వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చి మేపాల్సిన అవసరం లేదని.. వెంటనే ఉరితీయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.
ajmal-kasab | mumbai-attack | Tahawwur Rana