బైక్‌పై హిందూ యువకుడు, ముస్లిం యువతి.. నలుగురు యువకులు ఏం చేశారంటే ?

కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుష ఘటన జరిగింది. ఓ హిందూ యువకుడు, ముస్లిం యువతి స్కూటీపై ఉండగా నలుగురు ముస్లిం యువకులు వాళ్లని వేధించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Hindu Man, Burqa-Clad Woman Harassed, Verbally Abused By Muslim Men In Bengaluru, 4 Arrested

Hindu Man, Burqa-Clad Woman Harassed, Verbally Abused By Muslim Men In Bengaluru, 4 Arrested


కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుష ఘటన జరిగింది. ఓ హిందూ యువకుడు, ముస్లిం యువతి స్కూటీపై ఉండగా నలుగురు ముస్లిం యువకులు వాళ్లని వేధించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 9న చంద్రా లే అవుట్ ప్రాంతంలో పార్క్ చేసిన స్కూటీపై ఓ హిందూ యువకుడు, బుర్ఖా ధరించిన ముస్లిం యువతి కూర్చున్నారు. ఇది చూసిన నలుగురు ముస్లిం యువకులు వాళ్ల వద్దకు వచ్చారు. 

Also Read: ఇదొక విచిత్రమైన లవ్ స్టోరీ.. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చి పాపను పడేశాడు!

ఆ యువతి, యువకుడు వేర్వేరు మతాలకు చెందడంతో వాళ్లు కలిసి ఉండటాన్ని నిలదీశారు. బుర్ఖా ధరించిన నువ్వు హిందూ అబ్బాయితో ఎందుకు బైక్‌పై కూర్చున్నావు అంటూ ఆగ్రహించారు. నీకు సిగ్గు లేదా ? కుటుంబ గౌరవం లేదా ? అంటూ తీవ్రంగా తిట్టారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ఫొన్ నెంబర్ ఇవ్వాలంటూ ఆ ముస్లిం మహిళను బెదిరించారు. 
 
అయితే ఆ వ్యక్తి తన క్లాస్‌మేట్ అని ఆమె చెప్పింది. తన ఫ్యామిలీ వాళ్ల ఫోన్‌ నెంబర్ ఎందుకు ఇవ్వాలంటూ అడిగింది. వేరే మతానికి చెందిన ఆ మహిళను ఎందుకు కలుస్తున్నావని ఆ యువకుడిని కూడా వాళ్లు నిలదీశారు. అతడిపై దాడి చేసేందుకు యత్నించారు. దీనికి సంబంధించిన వీడియోను రికార్డ్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Also Read: స్కూల్ బ్యాగ్‌లో కండోమ్స్, తంబాకు ప్యాకెట్లు, కత్తులు, అగ్గిపెట్టలు.. ఎవర్రా మీరంతా!

చివరికి ఈ ఘటనపై స్పందించిన ఆ ముస్లిం అమ్మాయి.. తమను వేధించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వాళ్లని మొహ్సిన్, మన్సూర్, అఫ్రిది, వసీం ఖాన్‌గా గుర్తించారు. మళ్లీ ఇలాంటి మోరల్ పోలిసింగ్ చేష్టలకు పాల్పడితే సహించేది లేదని పోలీసులు వాళ్లకి హెచ్చరించారు.  

Also Read: బిగ్ బ్రేకింగ్...తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు ఖరారు

rtv-news | hindu-muslim | national-news 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు