TBGKS : కవితకు ఊహించని షాకిచ్చిన కేసీఆర్.. ఆ పదవి నుంచి ఔట్!

బీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇన్నాళ్లు ఆ యూనియన్‌ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థానంలో సంఘం  గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి  కొప్పుల ఈశ్వర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

New Update
TBGKS

TBGKS Executive Committee Meeting

కల్వకుంట్ల కవిత(brs mlc kavitha) అమెరికా పర్యటన(America Tour) నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అనుబంధ సింగరేణి కార్మిక సంఘంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇన్నాళ్లు ఆ యూనియన్‌ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితను కాదని సంఘం  గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి  కొప్పుల ఈశ్వర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ రోజు హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌(telangana bhavan news) లో జరిగిన టీబీజీకేఎస్‌ కార్యవర్గ సమావేశంలో   కొప్పుల ఈశ్వర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యకలాపాలను పార్టీ తరఫున ముందుకు తీసుకెళ్లేందుకు భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది.

కాగా ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీలో జరగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో యూనియన్‌ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితను తప్పించి కొప్పుల ఈశ్వర్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించినట్లు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) ప్రకటించారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన కవిత సింగరేణిలో జాతీయ సంఘంగా ఉన్న హెచ్‌ఎంఎస్‌తో చేతులు కలిపింది. ఇప్పటి నుంచి తెలంగాణ జాగృతి, హెచ్‌ఎంఎస్‌ కలిసి పనిచేస్తాయని ప్రకటించింది.  అయితే రెండు రోజుల క్రితం కవిత తన కుమారుని విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లింది. ఈ తరుణంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

Also Read :  ప్రాణం తీసిన ట్రాన్స్‌ఫార్మర్.. మూత్రం పోస్తుండగా కరెంట్ షాక్

KCR Gave Shock To Kavitha

సింగరేణిలో తెలంగాణ వాదాన్ని వినిపించాలన్న లక్ష్యంతో 2003లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS)  ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ చేతుల మీదుగా ఆవిర్భవించింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహారించింది. ఆ తర్వాత  2012, 2017లో రెండుసార్లు సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా ఎన్నికైంది. దాదాపు పదేళ్లపాటు గనుల్లో హవా కొనసాగించింది.  అయితే ఆ తర్వాత వచ్చిన యూనియన్‌ అంతర్గత కుమ్ములాటలతో సింగరేణిలో ఆ సంఘం బలహీనపడుతూ వచ్చింది. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి చెందగా, అనంతరం సింగరేణి ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదని పోటీ చేయడం లేదని ప్రకటించింది. అయితే నామమాత్రంగా పోటీలో ఉన్నప్పటికీ  టీబీజీకేఎస్‌ ఓటమి చవిచూసింది. ఆ తర్వాత సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట కవిత ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్‌ అయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ ఓటమి పాలవ్వడంతో బీఆర్‌ఎస్‌ లో నైరాశ్యం నెలకొంది. అయితే తిరిగి పార్టీ బలోపేతం తో పాటు అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో తిరిగి టీబీజీకెఎస్‌కు పూర్వ వైభవం తీసుకు రావాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అందులో భాగంగా తెలంగాణ భవన్ లో బుధవారం జరిగిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కార్యవర్గ సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ను తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) కేంద్ర కార్యవర్గ గౌరవ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది

ఇక మీదట  తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులుగా, సంఘం వ్యవస్థాపక సభ్యులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యవహరిస్తారని, ఆయన ఆధ్వర్యంలో కార్మిక సంఘం కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలని, అలాగే సింగరేణి సమస్యలపై పెద్దఎత్తున పోరాటాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగిందని యూనియన్ నాయకులు తెలిపారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంతో పాటు, ఇతర రూపాల్లో ఒత్తిడి తీసుకురావాలని, పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికుల కొరకు, సింగరేణి సంస్థ కొరకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా కార్మికుల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు  సూచించినట్లు తెలిసింది.  కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అడ్డగోలుగా అమలు చేయడానికి వీలుకాని హామీలు ఇచ్చిన తీరుగానే, సింగరేణికి కూడా మోసం చేసిందని, ఈ అంశాలను కార్మికుల దృష్టికి తీసుకువెళ్లాలని సమావేశంలో నిర్ణయించినట్లు నాయకులు  తెలిపారు.  

ఇది కూడా చూడండి:తెలంగాణలో కొత్త మద్యం షాపులు.. లైసెన్స్‌లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Advertisment
తాజా కథనాలు