/rtv/media/media_files/2025/08/20/ashwini-vaishnaw-2025-08-20-14-02-47.jpg)
Ashwini Vaishnaw Introduces Promotion and Regulation of Online Gaming Bill, 2025
ఆన్‌లైన్ బెట్టింగ్‌ను కేంద్ర ప్రభుత్వం నేరంగా పరిగణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw).. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025(Online Gaming Bill-2025)ను బుధవారం ప్రవేశపెట్టారు. దీనిపై విపక్షాలు తీవ్ర ఆందోళనలు చేశాయి. అయినప్పటికీ ఆందోళనల నడుమే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ తర్వాత సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఈమధ్య కాలంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు బలై ఎంతోమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది.
Also Read: సీఎం రేఖా గుప్తాపై దాడి చేసింది కుక్కల ప్రేమికుడే.. పక్కా ప్లాన్‌తో దాడి చేశాడా?
Ashwini Vaishnaw Introduces Online Gaming Bill 2025
అయితే ఆన్‌లైన్ గేమ్స్, ఈస్పోర్ట్స్ మధ్య విభజన ఉండేలా ఈ బిల్లును తయారుచేశారు. ఎవరైనా రూల్స్ పాటించకుండా ఆన్‌లైన్ గేమ్స్ అందిస్తే వాళ్లకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. లేదా రూ.కోటి జరిమానా ఉంటుంది. లేదా ఈ రెండు కూడా విధించాలని ప్రతిపాదనలు చేశారు. అంతేకాదు సంబంధిత అజ్వర్టయిజ్‌మెంట్లలో భాగం పంచుకున్న వాళ్లకు కూడా కేంద్రం షాక్ ఇచ్చింది. వీళ్లకు గరిష్ఠంగా రెండేళ్ల వరకు జైలుశిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధించనున్నారు.
అలాగే దీనికి సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో(Online Transactions) ప్రమేయం ఉన్నవాళ్లకు గరిష్ఠంగా 3 ఏళ్ల జైలు శిక్ష, రూ.కోటి జరిమానా ఉంటుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ బిల్లు ప్రకారం ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాళ్లు నేరస్థులగా కాకుండా బాధితులుగా ఉంటారు. మరోవైపు ఈ బిల్లు వల్ల తమ రంగానికి తీవ్ర నష్టం ఉంటుందని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు లేఖ రాసింది. ఆన్‌లైన్ గేమింగ్స్‌పై నిషేధం విధించకుండా నియంత్రణ ఉంచాలంటూ సూచనలు చేసింది .
Also Read: పాకిస్తాన్‌లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. 365కు పెరిగిన మృతుల సంఖ్య!
ఇదిలాఉండగా ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్(Betting Apps) ఆగడాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. చాలామంది ముఖ్యంగా యువత ఆ యాప్స్‌కు బానిసలైపోతున్నారు. అప్పుల్లో చిక్కుకుంటున్నారు. వాటిని తీర్చలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరు సినీ, స్పోర్ట్స్ ప్రముఖులు కూడా బెట్టింగ్ యాప్‌లు ఇటీవల ప్రమోట్ చేశారు. పలువురు ప్రముఖ యూట్యూబర్లు కూడా బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారు. దీంతో ప్రస్తుతం వాళ్లు దర్యాప్తు ఏజెన్సీల నుంచి విచారణను ఎదుర్కొంటున్నారు. పలు రాష్ట్రాలు ఇప్పటికే బెట్టింగ్ యాప్స్‌పై నిషేధం విధించాయి. కానీ కొందరు ఆకతాయిలు గుట్టుచప్పుడు కూడా వీటిని వాడుతున్నారు. అందుకే కేంద్రం దేశవ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్స్ ఆగడాలకు అరికట్టేందుకు ఈ బిల్లును తీసుకొచ్చింది. బెట్టింగ్ యాప్ ఊబిలో పడకూడదని ఇప్పటికే పోలీసులు యువతకు సూచనలు చేస్తున్నారు.
Also Read: నిన్నటి వరకు నోబెల్ ప్రైజ్...ఈరోజు ఏకంగా స్వర్గానికే టెండర్..ట్రంప్ లో ఆసక్తికర కోణం