/rtv/media/media_files/2025/10/13/jubilee-hills-bypoll-2025-10-13-18-03-51.jpg)
Jubilee Hills Bypoll
Jubilee Hills Bypoll : మాగంటి గోపినాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన జూబ్లీహిల్స్ ఎన్నికలకు ఈ రోజు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. తొలిరోజే పలువురు అభ్యర్థులు పోటీపడి మరి నామినేషన్లు దాఖలు చేశారు. ఉదయం నుంచే నామినేషన్ల సందడి నెలకొంది. ఈ ఉపఎన్నికకు తొలిరోజు 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో ఇద్దరు రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు కాగా.. 8 స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. రిజిస్టర్ పార్టీలైన తెలంగాణ పునర్ నిర్మాణ సమితి తరుపున పూస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే నవతరం పార్టీ తరుపున అర్వపల్లి శ్రీనివాస రావు నామినేషన్ వేశారు. వారిద్దరితో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా చలిక చంద్ర శేఖర్, సపవత్ సుమన్, సిలివేరు శ్రీకాంత్, పెసరకాయల పరీక్షిత్ రెడ్డి, వేముల విక్రమ్ రెడ్డి, ఇబ్రహీం ఖాన్ తదితరులతో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. తొలిరోజు నామినేషన్ సమయం మించిపోవడంతో ఈ రోజు నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది.
Also Read : వేములవాడలో దర్శనాల వివాదం..పొంతనలేని ప్రకటనలతో అయోమయం
Nominations Are In Full Swing In Jubilee Hills
ఇక జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఈ రోజు నోటిఫికేషన్ విడుదల కావడంతో .హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ మీడియాతో సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నామినేషన్లు స్వీకరిస్తున్నామని వెల్లడించారు. ఈ రోజు నుంచి ఈనెల 21వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామని తెలిపారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. 100 మీటర్ల వరకు ఎలాంటి ర్యాలీలకు అనుమతి ఉండదని తేల్చి చెప్పారు. 4 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో భాగం అవుతున్నారని చెప్పారు. నియోజవర్గ పరిధిలో 45 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని కర్ణన్ వివరించారు.
Also Read : జూబ్లీహిల్స్ లో దొంగ ఓట్ల కలకలం.. ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్!
మరోవైపు జూబ్లిహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు మూడు నువ్వా నేనా అనే రీతిలో ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్(BRS Party) తన దూకుడు పెంచింది. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత నేత మాగంటి గోపీనాథ్(brs mla maganti gopinath) భార్య సునీత పేరును బీఆర్‌ఎస్ పార్టీ ఖరారు చేసింది, ఈ క్రమంలో ఎల్లుండి (ఈనెల 15) తమ అభ్యర్థి మాగంటి సునీతతో నామినేషన్ వేయించాలని బీఆర్‌ఎస్ నాయకత్వం భావిస్తుంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్(naveen yadav) పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. ఆయన కూడా తనదైన శైలిలో ప్రచారం మొదలు పెట్టారు. అయితే బీజేపీ అభ్యర్థి పేరు ఇంకా ఖరారు కాలేదు. పలువురి పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరిని ఫైనల్ చేస్తుందనేది ఇంకా తేలాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: దారుణం.. 14 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి.. వరి పొలంలో పాతిపెట్టిన దుర్మార్గుడు